అమ్మ పథకాలను కొనసాగిస్తాం.. ఆశయాలు సాధిస్తాం.. Panneerselvam Worked Against Amma's Govt, Says TN CM

Panneerselvam worked against amma s govt says tn cm

tamil nadu, palnisamy, paneer selvam, Dharma yudhdam, pandyarajan, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Tamil Nadu Chief Minister Edappadi K. Palanisamy on Saturday lashed out at former state chief minister O. Paneerselvam, saying that the latter worked against late J. Jayalalithaa's government.

అమ్మ పథకాలను కొనసాగిస్తాం.. ఆశయాలు సాధిస్తాం..

Posted: 02/18/2017 05:08 PM IST
Panneerselvam worked against amma s govt says tn cm

తమిళనాడు స్వర్గీయ ముఖ్యమంత్రి పురచ్చితలైవి జయలలిత ఆశయాలను ముందుకు తీసుకుపోతామని విశ్వాసపరీక్ష నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. పార్టీ వ్యవస్థాపకులైన ఎంజీఆర్‌ సహా అమ్మ ఆశయాలను సాధిస్తాం. అమ్మ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాంమని పళని స్వామి ప్రకటించారు. చిన్నమ పేరును కూడా ప్రస్తావించిన పళనిస్వామి.. అమ్మ, చిన్నమ్మల అశీస్సులతోనే తాము విశ్వాస పరీక్షలో నెగ్గగలిగామని అన్నారు. విశ్వాసపరీక్ష గెలిచిన అనంతరం తనకు మద్దుత్తునిచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా మెరినా బీచ్ లోని జయలలిత సమాధి వద్దకు చేరుకుని ఘన నివాళులర్పించారు.

అమ్మ గెలిచిందంటూ నినాదాలతో మెరీనా బీచ్‌ లోని అమ్మ సమాధి మారుమోగింది. ఈ సందర్భంగా పళనిస్వామి.. అమ్మకు నివాళులర్పిస్తూ పళని స్వామి కన్నీరు పెట్టారు. అమ్మ గెలిచిందంటూ నినాదాలు  మిన్నంటాయి. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పళనిస్వామి ఇన్నాళ్లు అమ్మకు విధేయుడిగా పేరొందిన పన్నీరుసెల్వం, ఆయనతో పాటు ఆయన వర్గం అమ్మ జీవితాంతం పోరాడిన డీఎంకేతో ఎలా చేతులు కలిపి ’అమ్మ’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా కుట్రలు చేసిందో, పనిచేసిందో ప్రతి ఒక్కరూ వీక్షించారని వ్యాఖ్యానించారు. అన్నా ద్రవడమున్నేట్ర కటగం పార్టీని  ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వమని  ప్రకటించారు.

పార్టీని ద్రోహులు, అరాచక శక్తుల చేతుల్లోంచి కాపాడుకున్నామని, చిన్నమ్మ శపథం నెరవేరిందంటూ పళని ఆవేశంగా మాట్లాడారు. డీఏంకేతో చేతులు కలిపి పన్నీరు తీవ్ర తప్పు చేశారని విమర్శించారు. అమ్మను అవమానించిన పార్టీతో చేతులు కలపి ద్రోహిగా మారాడని విమర్శించారు. నిజమైన అమ్మ మద్దతు దారులెవరో ఈ రోజు తేలిపోయిందని పళని స్వామి చెప్పారు.  సభలో విపక్షాల ప్రవర్తనా తీరు బాధాకరమన్నారు. అంతకుముందు ఆయన మెరీనా బీచ్‌ లోని అమ్మసమాధిని దర్శించుకుని జయలలితకు నివాళులర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles