స్టాలిన్ చొక్కా ఎలా చిరిగింది..? గవర్నర్ ను కలసి ఆయన ఏం చెప్పారు..? Stalin sits in protest in Marina under Gandhi statue

Stalin immediately dashed off to the raj bhavan to meet

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

DMK Working President M.K. Stalin sat in protest near the Mahatma Gandhi statue on Marina beach against the manner in which he and his party legislators were evicted from the state assembly.

స్టాలిన్ చొక్కా ఎలా చిరిగింది..? గవర్నర్ ను కలసి ఆయన ఏం చెప్పారు..?

Posted: 02/18/2017 03:42 PM IST
Stalin immediately dashed off to the raj bhavan to meet

త‌మిళ‌నాడు శాస‌న‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోంటున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ చోక్కా ఎలా చిరిగింది. ఆయన చోక్కా బొత్తాలు లేకుండానే గవర్నర్ వద్దకు ఎందుకు వెళ్లారు. ఆ తరువాత మెరినా బీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద దీక్షకు ఎందుకు కూర్చున్నారు. ఇవాళ పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర గంధరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించారు.

పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, అయినా తాను సంయమయంతో సభను రాజ్యాంగబద్దంగా నడిపిస్తున్న క్రమంలో తీరు మారని విపక్ష సభ్యలు అదే గంధరగోళానికి తెరతీయడంతో.. వారిని సభ నుంచి స్పీకర్ దన్ పాల్ సస్సెండ్ చేశారు. అయితే తాము అసెంబ్లీ బ‌య‌ట‌కు వెళ్ల‌బోమని చెప్పి సభలోనే ఉండిపోయిన‌ డీఎంకే సభ్యులను మార్షల్స్ బయటికి పంపారు. బలవంతంగా మార్షల్ బయటకు తీసుకువచ్చిన ఎమ్మెల్యేలను మళ్లీ స్టాలిన్ లోనికి తీసుకెళ్లారు.

ఈ తరుణంలో అయన సభలోకి వెళ్తుండగా మార్షల్స్ అడ్డుకున్నారు. అయనను బలవంతంగా దాదాపు 15 నుంచి 20 మంది మార్షల్ బలవంతంగా అసెంబ్లీ బయటకు ఎత్తుకువచ్చారు. అయితే మార్షల్స్ స్టాలిన్ ను ఎత్తుకువస్తున్న సమయంలో ఆయన చోక్కా చిరిగిపోయింది. చోక్కా బోత్తాలు కూడా ఊడిపోయాయి. అయితే అసెంబ్లీలో రహస్య ఓటింగ్ కోసం తాము డిమాండ్ చేస్తే.. తమను బలవంతంగా మార్షల్స్ చేత తిట్టించి, కోట్టించి సభ బయటకు పంపించివేశారని  నేత‌లు ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ స్పీక‌ర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. స్పీక‌ర్ త‌న చొక్కా తానే చింపుకొని డీఎంకే నేత‌లు చింపార‌ని అవాస్త‌వాలు చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. తాము స‌భ‌లో కేవ‌లం ర‌హ‌స్య ఓటింగ్‌కు మాత్ర‌మే ప‌ట్టుబ‌ట్టామ‌ని అన్నారు.

త‌మ‌ను మార్ష‌ల్స్ బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపేశార‌ని అన్నారు. అసెంబ్లీలోకి తాము వెళ్లబోమని చెప్పారు. స్పీకర్ ఆదేశాలతో సభలోకి పోలీసులు సైతం వచ్చి తమను బయటకు లాక్కొచ్చారని, తన చొక్కా చిరిగిపోయిందని ఆయన తన చినిగిన చొక్కాని చూపిస్తూ ఆరోపణలు గుప్పించారు. తన చిరిగిన చొక్కాను మార్చుకోకుండానే మీడియా ముందుకు తమ ఎమ్మెల్యేలతో వచ్చిన స్టాలిన్ అక్కడి నుంచి అదే చొక్కాతో రాజభవన్ కు వెళ్లి.. గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి అసెంబ్లీలో తనపై జరిగిన దౌర్జన్యకాండను వివరించారు. ఆ తరువాత నేరుగా మెరినా బీచ్ కు వెళ్లి అక్కడున్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles