శశికళ తాజా పాచిక.. పార్టీలోకి దినకరణ్, వెంకటేష్ Sasikala's Nephews Dinakaran Back In Party

Sasikala s nephews dinakaran back in party

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, TTV Dinakaran, Venkatesh, disproportionate case, palanisamy, sendigottanyan, thambidurai, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

VK Sasikala's relatives TTV Dinakaran, and S Venkatesh who are expelled by former Chief Minister J Jayalalithaa are back in the AIADMK, to secure her hold over Tamil Nadu's ruling party.

శశికళ తాజా పాచిక.. పార్టీలోకి బహిష్కృత నేతలు

Posted: 02/15/2017 11:16 AM IST
Sasikala s nephews dinakaran back in party

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వికే శశికళ అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్థరణ కావడంలో అమె జైలుకు వెళ్లడం ఖాయమైనందున పార్టీలో తన అధిపత్యానికి ఎలాంటి ఢోకా లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. పార్టీలో తన పనులను చకచక చక్కబెట్టుకోవడంతో పాటు తన బంధువర్గానికి చెందిన వారికి కీలక పదవులను కట్టబెట్టారు. పార్టీకి అన్యాయం చేస్తున్నారని స్వర్గీయ ముఖ్యమంత్రి జయలలిత పార్టీకి దూరంగా వుంచిన టీటీవీ దినకరణ్ తో పాటు ఎస్ వెంకటేశ్లకు పార్టీలో పదవులను కేటాయించారు.

అయితే అన్నాడీఎంకే చరిత్రలో లేని పదవికి తన మేనల్లుడు దినకరణ్ కోసం ప్రత్యేకంగా సృష్టించి నియమించారు. దినకరణ్ ను పార్టీ డి్ప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన కుటుంబంలోని వ్యక్తుల చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండాలని భావించిన శశికళ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడున్నరేళ్ల తరువాత తాను వచ్చి పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టేవరకు దినకరణ్ పై పార్టీని కాపాడే బాధ్యతను వుంచారు.

ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అమె దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయస్థానం తిరస్కరించడంతో అమె ఇవాళ బెంగళూరు కోర్టుకు వెళ్లి లొంగిపోవాల్సి వుంది. సాయంత్రం లోగా లోంగిపోవాలని.. ఇప్పటికే తీర్పును వెలువరించిన కేసులో మరింత సమయాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంతో చిన్నమ్మ పోలీసులకు లొంగిపోతారా..? లేక బెంగళూరుకు వెళ్లి కోర్టులో లోంగిపోతారా అన్నది వేచి చూడాల్సిందే. కాగా లొంగిపోయేందుకు ముందు అమె తన నిచ్చెలి జయలలిత సమాధి వద్దకు వెళ్లనున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  disproportionate case  TTV Dinakaran  Venkatesh  AIADMK  

Other Articles