ఉత్తరప్రదేశ్ లో ఓ యువతి హత్య సంచలనంగా మారింది. అందుకు కారణం ఆమె ఒక అత్యాచార బాధితురాలు కావటమే. పై పెచ్చు అత్యాచారం చేసినవారిలో అధికార పక్షం సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటూ ఆ యువతి ఆరోపించటమే. దీంతో ఆ ఎమ్మెల్యేపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్లితే.. సుల్తాన్ పూర్ కు చెందిన 22 ఏళ్ల యువతిపై 2013 లో సామూహిక అత్యాచారం జరిగింది. అందులో స్థానిక ఎమ్మెల్యే అరుణ్ వర్మ కూడా ఉన్నాడంటూ ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసు మూడేళ్లవుతున్నా విచారణ ఇంత వరకూ పూర్తవలేదు. పైగా దోషులు తప్పించుకునేందుకు ఖాకీలు సాయం చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపించాయి. దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని యువతి చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పింది కూడా. ఇంతలో పోలీసులు ఎమ్మెల్యేకు క్లీన్ చీట్ ఇవ్వటం, స్థానిక యువకులపై కేసు నమోదు చేయటం వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉంటే శనివారం ఇంటి బయట ఉన్న బాత్ రూం కు వెళ్లిన యువతి ఎంతకు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి పోలీస్ ఫిర్యాదు చేయగా, ఆదివారం సమీపంలోని పోదల్లో శవం కనిపించింది. గొంతు నులిమినట్లు స్పష్టంగా తెలియటంతో పోస్ట్ మార్టం కోసం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. తమకు ఆ ఎమ్మెల్యే నుంచి హని ఉందన్న విజ్నప్తితో ఇంత కాలం రక్షణ కల్పించారు పోలీసులు. ఈ మధ్యే వారిని వెనక్కి తీసుకుంది పోలీస్ శాఖ. ఆ వెనువెంటనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయి విగత జీవిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై మర్డర్ కేసు ఫైల్ చేసినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా, సుల్తాన్ పూర్ నుంచి ఈ దఫా ఎన్నికల్లో కూడా అరుణ్ పోటీ చేస్తుండటం విశేషం. ఫిబ్రవరి 27న ఆ స్థానానికి ఎన్నిక జరగనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more