పాపం పన్నీర్.. దటీజ్ శశికళ.. ఆరోజు అలా జరగకపోయి ఉంటే ఎలా ఉండేదో? | Chinnamma Sasikala will replace Panneerselvam.

Panneerselvam stays mum on sasikala s elevation

Chinnamma Sasikala, VK Sasikala Natarajan, Tamil Nadu CM Sasikala, Sasikala Husband Health, VK Natarajan Health, CM Sasikala Natarajan, Sasikala Video Rental Shop, O Paneerselvam Tea Chop, O Paneerselvam Sasikala Natarajan, Sasikala Natarajan Biography, Paneerselvam Political carrier, Sasikala Natarajan Political carrier

Sasikala to take over as chief minister of Tamil Nadu, O Panneerselvam resigns. A Sasikala says 'Loyal Brother' Panneerselvam urged me to take charge as AIADMK general secretary and CM. From Video a shop owner to Tamil Nadu CM, quite a journey for 'Chinnamma' Sasikala. AIADMK's O Paneerselvam journey from Tea-shop owner to Tamil Nadu Politics.

పాపం పన్నీర్.. దటీజ్ శశికళ...

Posted: 02/06/2017 09:13 AM IST
Panneerselvam stays mum on sasikala s elevation

దివంగత జయలలిత తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో రాజకీయాలను నడిపించే సత్తా ఉందా? అన్న ప్రశ్నలు ఓవైపు సంధిస్తుంటే... ముఖ్యమంత్రిగా చక్రం తిప్పేందుకు శశికళ సిద్ధమైపోయింది. వీడియో పార్లర్‌తో కెరీర్ ప్రారంభించిన శశికళ జీవితం ఎన్నో మలుపులు తిరిగి చివరకు సీఎం పీఠంపైకి చేరింది. అచ్చం ‘అమ్మ’లా వస్త్రధారణ మార్చివేసి చిన్నమ్మగా మారిపోవటమే కాదు, ముఖ్యమంత్రి అయ్యి తీరాలన్న తన పంతం నెగ్గించుకుంది. శశికళ ప్రస్థానం ఇప్పటిదాకా ఎలా సాగిందో ఓసారి గమనిస్తే...

రామనాథపురంలో ఓ నాటు వైద్యుడి కుటుంబంలో జన్మించిన శశికళ కుటుంబం తర్వాత తంజావూరు వలస వెళ్లింది. వివేకానందన్, కృష్ణవేణి దంపతుల ఐదో సంతానమే శశికళ. అప్పట్లో శశికళ కుటుంబాన్ని ముద్దుగా ‘ఇంగ్లిష్ మందుల దుకాణం వాళ్లు’ అని అందరూ పిలిచేవారంట. అలా పాపులర్ కావటంతో మెల్లిగా రాజకీయ నేతలు కూడా వారికి పరిచయం కావటం ప్రారంభించారు. డీఎంకే చీఫ్ కరుణానిధి చేతుల మీదుగా 1970లో శశికళ, నటరాజన్‌ల వివాహం జరిగింది.

ఇక నటరాజన్ 1980లో చెన్నైలో ప్రభుత్వ పౌర సంబంధాల అధికారిగా ఉండేవారు. శశికళ అన్నాసలైలోని జెమినీ పార్సన్ కాంప్లెక్స్‌లో ‘వినోద వీడియో విజన్’ పేరుతో వీడియో క్యాసెట్ల షాపు నిర్వహించేవారు. ఎంజీ రామచంద్రన్ 1982లో జయలలితను పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఆ సమయంలో ఎంజీర్ సర్కారు బడిపిల్లల పౌష్టికాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. కడలూరులో నిర్వహించిన ఈ పథకం ప్రచార కార్యక్రమానికి జయలలిత హాజరయ్యారు. అక్కడ జయకు అప్పటి కలెక్టర్ చంద్రలేఖతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో పౌర సంబంధాల అధికారిగా ఉన్న నటరాజన్ ఆ పథకానికి విస్తృత ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న జయలలితకు చంద్రలేఖ సహాయకురాలిగా నియమితులయ్యారు. అలా క్రమంగా వీరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. జయ ఎక్కడికి వెళ్లినా చంద్రలేఖ ఆమె వెన్నంటే ఉండేవారు.

ఓ సందర్భంలో చంద్రలేఖ.. జయలలితకు శశికళను పరిచయం చేశారు. దీంతో చంద్రలేఖ లేని సమయాల్లో బోర్ అనిపించిన ప్రతిసారి జయలలిత.. శశికళ నడుపుతున్న వీడియో షాపు నుంచి ఇంగ్లిష్ సినిమాల క్యాసెట్లను తెప్పించుకుని చూసేదంట. ఈ క్రమంలో శశికళతో ప్రారంభమైన పరిచయం క్రమంగా మొగ్గతొడిగి విడదీయరానంతగా పెనవేసుకుపోయింది. 1989 నుంచి శశికళ.. జయలలితోనే ఉండిపోయారు. పోయెస్ గార్డెన్‌లోని జయ ఇంట్లో పనిచేసే వారందరినీ తన సొంతూరైన మన్నార్‌గుడి నుంచి శశికళ రప్పించారు. ఆపై శశికళతో విడదీయలేనంత అనుబంధాన్ని పెంచుకున్న జయలలితకు తన వెనక శశికళ నడుపుతున్న తతంగం గురించి తెలిసి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ ఆ వివరాలను జయకు అందించారన్న టాక్ ఒకటి ఉండేది. ఆపై మన్నార్ మాఫియాను పోయెస్ గార్డెన్ నుంచి తరిమేసి పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఆ తర్వాత మళ్లీ కరుణించిన జయ ఆమెను దగ్గరికి తీసుకున్నారు. ఒకవేళ శశికళను జయ దగ్గరికి తీసుకోకుంటే ప్రస్తుత తమిళ రాజకీయాలు మరో రకంగా ఉండేవని చెబుతున్నారు.

త్యాగశీలుడు పన్నీర్ సెల్వం...

మూడుసార్లు సీఎం గద్దెనెక్కినా కరువుదీరా ఒక్కసారి కూడా ఏడాదిపాటు పాలించని రికార్డు ఖాతాలో వేసుకున్నాడు పన్నీర్ సెల్వం. జనవరి 14, 1951న జన్మించిన పన్నీర్ స్వగ్రామం తేని జిల్లాలోని పెరియకుళం. ఒట్టకార దేవర్, పళనియమ్మాల్ నాచ్చియార్ తల్లిదండ్రులు. పూర్తిగా వ్యవసాయ కుటుంబం. బీఏ వరకు చదువుకున్నారు. ప్రాణస్నేహితుడు షాబుద్దీన్ ఇచ్చిన ప్రోత్సాహంతో పన్నీర్ సెల్వం రాజకీయాల్లో అడుగుపెట్టారు. భార్య విజయలక్ష్మి. వీరికి ముగ్గురు పిల్లలు. అన్నాడీఎంకే కార్యకర్తగా పనిచేస్తూనే పెరియకుళంలో టీ షాపు నడిపేవాడు.

మృదు స్వభావిగా, జనం మెచ్చిన వ్యక్తిగా తక్కువ కాలంలోనే పాపులర్ అయిపోయాడు. పైగా వివాదరహితుడు కావటంతో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సెల్వంకు మంత్రి పదవి కట్టబెట్టింది జయలలిత. ఆ కృతజ్నతతోనే అమ్మకు అనుచరుడిగా మారిపోయాడు. ఇక అక్రమాస్తుల కేసుల కేసులో అరెస్టై జైలుకి వెళ్లాక, ఆపై చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం. అమ్మ జైల్లో ఉన్న సమయంలో ఆమె ఫోటోతో పాలన సాగించి అభినవ భరతుడిగా పేరుపొందటమే కాదు, తిరిగి బయటకు వచ్చాక పూలలో అధికారాన్ని పెట్టి మళ్లీ అప్పగించి అంతర్జాతీయ మీడియా లో సైతం తమిళ రాజకీయాలపై చర్చ జరిగేలా చేశాడు.

ఇక జయ చనిపోయాక ముసలంతో ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో గట్టి ప్రయత్నాలే చేశాడని అంతర్గతంగా అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్పుకుంటారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ పట్ల కూడా భక్తిభావం చాలానే ప్రదర్శించాడు. ఇక ఇప్పుడు రాజీనామా చేయటంతో జయలలితకు అత్యంత విశ్వాస పాత్రుడి త్యాగంపై తంబీలు తెగ బాధపడిపోతున్నారు. తాను అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడమే కాదు, ముఖ్యమంత్రి కావాలని విధేయుడైన సోదరుడు సెల్వం ఒత్తిడి తెచ్చాడంటూ శశికళ చేసిన వ్యాఖ్యలు అతనిలోని నిజాయితీని నిరూపిస్తోంది. అంతేకాదు ఒకానోక దశలో వాదులాడాడంట కూడా. నిన్నమొన్నటి వరకు ఆయనను దునుమాడిన ప్రత్యర్థులే ఇప్పుడు ఆయనను చూసి జాలిపడే స్థాయికి పరిస్థితి చేరింది. ఇదిలా ఉంటే పన్నీర్ సెల్వం రాజీనామాను ఈ ఉదయం గవర్నర్ సీహఎచ్ విద్యాసాగర్ ఆమోదించారు కూడా.

శశికళ భర్తకు సీరియస్?

దేశానికి 17వ మహిళా సీఎంగా, తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కూర్చోబోతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ కు మరో ట్విస్ట్. ఆమె భర్త నటరాజన్‌ తీవ్ర అనారోగ్యం పాలయి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్వాసకోశ సమస్యలు రావడంతోనే ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు ఊపిరి అందటమే కష్టంగా ఉందని చెబుతున్నారు. పూర్తి సమాచారం లేకపోవటంతో నటరాజన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న అనుమానాలు తలెత్తాయి. మరోవైపు సీఎం పదవి చేపట్టేందుకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఉన్నట్టుండి ఆమె భర్త ఆస్పత్రి పాలు కావటం ఆందోళనకు గురిచేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : VK Sasikala  Tamil Nadu  Chief Minister  O Paneerselvam  

Other Articles