బాయ్ ఫ్రెండ్స్ లేరా..? అయితే క్లాస్ ఫస్ట్‌ మార్కులెందుకు..? Is Sunny Leone a role model for the school girls of India?

Is chinnamma sasikala taking over as tamil nadu cm

kendriya vidyalaya, kumar thakur, cv raman road, Bengaluru, sexually abuse, principal, class XII student, sadashivanagar police station, physics teacher, shanmugam, karnataka

The complainant alleged that the principal regularly summoned girl students to his chamber on the pretext of counselling them and displayed his deviant behaviour.

బాయ్ ఫ్రెండ్స్ లేరా..? అయితే క్లాస్ ఫస్ట్‌ మార్కులెందుకు..?

Posted: 02/04/2017 02:30 PM IST
Is chinnamma sasikala taking over as tamil nadu cm

క్రమశిక్షణకు అలవాలంగా నిలిచే కేంద్రీయ విద్యాలయాల్లో ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న పలు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ లోని ఓ కేంద్రీయ విద్యాలయంలో తమ కన్నా అధికంగా మార్కుటు తెచ్చుకోవడంపై కోపోద్రిక్తులైన ఇద్దరు అన్నదమ్ములు.. ఓ మెరిట్ విద్యార్ధిపై దాడికి పాల్పడటంతో పాటు అసభ్యకర పదజాలంతో దూషించారు. వారిద్దరూ  స్థానిక గ్యాంగ్ స్టర్ కుమారులన్న విషయం తెలసుకున్న పాఠశాల యాజమాన్యం విషయాన్ని గొప్యంగా వుంచేందుకు ప్రయత్నించింది. చివరికు సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగుచూడటంతో పాఠశాల ప్రిన్సిపాల్ సహా పలువురిపై కేంద్రం చర్యలు తీసుకుంది.

ఈ విషయాన్ని పక్కనబెడితే నిన్నమొన్నటి వరకు బెంగుళూరు పాఠశాలలు అత్యాచారాలకు నిలయాలుగా మారాయన్న అప్రతిష్ట మూటగట్టుకున్నాయి. పాఠశాలలోని సెక్యూరిటీ గార్డులు, ఉపాధ్యాయులు, బస్సు డ్రైవర్లు ఇలా ఎవరి చేతిలోనూ తమ చాన్నారులు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురైన ఘటనలతో అసంఘటితంగా వుండే విద్యార్థులు సంఘటితమై నిరసనలు, రాస్తా రోకోలు చేసేంత వరకు పరిస్థితి వెళ్లింది. క్రమంగా పోలీసులు పాఠశాల యాజమాన్యలు తీసుకున్న చర్యలతో అవి తగ్గుముఖం పడగా, ఇప్పుడిప్పుడే తమ పిల్లలను తల్లిదండ్రులు ధైర్యంగా పాఠశాలలకు పంపుతున్న క్రమంలో మరో ఘటన వెలుగుచూసింది.

నీకు బాయ్‌ఫ్రెండ్‌ లేరా..? 12 క్లాస్ వరకు వచ్చావు..? త్వరలో మేజర్ అవుతావు..? అయినా బాయ్ ఫ్రెండ్స్ లేరా..? అయితే నీకు క్లాస్ ఫస్ట్ మార్కులు ఎందుకు..? నా మాట విను.. బాయ్ ఫ్రెండ్స్ ను పెట్టుకో. సన్నీ లియోన్‌ ఆదర్శంగా తీసుకో. శృంగార సాధనాలు వాడు. నన్ను తరచూ కలుస్తూ ఉండు. నేను నీకు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాను. నా మాట వినలేదనుకో.. నీకు క్లాస్‌ ఫస్ట్‌ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావు’ .. ఇవి ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పన్నెండో తరగతి విద్యార్థినితో అన్న మాటలు.

బాగా చదువుకునే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించి.. వారికి ఉత్పన్నమయ్యే సందేహాలను నివృత్తి చేయడంతో సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులకే హెడ్ గా వున్న ఓ ప్రిన్సిపాల్‌ అత్యంత అమానవీకరంగా చెప్పిన మాటలు విన్న విద్యార్థిని ఖంగుతినింది. ఎంతో హుందాగా వుండాల్సిన ప్రిన్సిపాల్ అత్యంత అసభ్యకర మాటలను ఉచ్చరించడంతో భాదితురాలు తన దుఖాన్ని, అవేదనను దిగమింగింది. ఈ ఘటన బెంగళూరు నగరంలోని సీవీ రామన్‌ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్‌ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ 12వ తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గత నెల 26న రాత్రి 7.20 గంటల నుంచి 8.10 మధ్య ఈ ఘటన జరిగింది. ఫిజిక్స్‌ టీచర్‌ షణ్ముగం తనను ప్రిన్సిపాల్‌ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్‌ చాక్లెట్‌ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది. కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూడటంతో నిపుణులు, డీపీఐ అధికారులు విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాగా ప్రిన్సిపాల్ ముందస్తు బెయిల్ పోందడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles