కేసీఆర్ లాంటి లీడర్ ఏపీకి కావాల్సిందే... | YSRCP MLA intresting comments on KCR.

Pinnelli ramakrishna reddy praised kcr

Macherla MLA, YCP Pinnelli Ramakrishna Reddy, YCP MLA KCR, Pinnelli Ramakrishna Reddy KCR, Pinnelli Ramakrishna Reddy Chandrababu Naidu, Pinnelli Ramakrishna Reddy Harish Rao, AP MLA Praise Telangana CM, AP MLA Praise KCR, KCR Harish Rao Andhra Pradesh, Andhra Pradesh MLA KCR and Harish Rao,

Macherla YCP MLA Pinnelli Ramakrishna Reddy Sensational Comments on AP CM Chandrababu Naidu. Praised KCR and Harish rao.

ప్చ్.. కేసీఆర్ ఏపీ లో ఉండుంటేనా...

Posted: 02/04/2017 01:27 PM IST
Pinnelli ramakrishna reddy praised kcr

ఓవైపు ప్రత్యేక హోదాపై తీవ్ర ఆగ్రహజ్వాలలు రగులుతున్న సమయంలో, దాని ద్వారా ప‌రిశ్ర‌మ‌ల‌కు రాయితీలు వ‌స్తాయ‌న‌డం శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు వ్యాఖ్యలు చేయటం చూస్తున్నాం. కేంద్రం నుంచి ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయన్నది ఆయన వాదన. అయితే హోదా ద్వారా దీర్ఘకాలిక లాభాలుంటాయన్నది ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఉద్యమ సమయంలో తప్ప సాధారణంగా ఈ మధ్య ఏపీ నేతలెవరూ మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం కేసీఆర్ ను, ఆయన మేనల్లుడు హరీష్ రావును మాత్రం పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరంగల్ లో జరుగుతున్న బాల వికాస నీటి శుధ్దికరణ కమిటీల మహాసభకు హాజరయ్యాడు. ఇందులో పిన్నెల్లి ప్రసంగిస్తూ కేసీఆర్‌ని ఆకాశానికెత్తేశాడు.

కేసీఆర్ లాంటి నాయకత్వం ఏపీలో లేదని తాను బాధపడుతున్నానంటూ వ్యాఖ్యానించాడు. ప్రజల క‌ష్టాల‌పై స్పందిస్తూ కేసీఆర్‌ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని, అలాగే తెలంగాణలో హరీష్‌రావు లాంటి నేత ఉండటం కూడా ప్రజల అదృష్టమ‌ంటూ మాట్టాడాడు. రాష్ట్ర పాలనలో త‌మ రాష్ట్రానికి, తెలంగాణకు ఎక్కడా పొంతన లేదని, ఏపీలో ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయన్నాడు. ప్రజల క‌ష్టాల‌ను గురించి ఆలోచించే పరిస్థితిలో నేతలు లేరని, ఎంతసేపు మీడియా మేనేజ్ మెంట్ గురించే ఆలోచిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలంగాణ ప్రభుత్వంపై ఇలా పొగడ్తలు పడేసరికి అక్కడే ఉన్న మంత్రి హరీష్ రావు సంతోషంతో ముసి ముసి నవ్వులు కురిపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Harish Rao  Chandrababu Naidu  Pinnelli Ramakrishna Reddy  Comments  

Other Articles