ఆ అధ్యక్షుడి చావు తేదీ చెప్పాడు.. అరెస్టయ్యాడు | Astrologer Wijemuni released on bail.

Seer arrested after predicting leader s death

Maithripala Sirisena Death, Astrologer Vijitha Rohana Wijemuni, Srilanka Astrologer, Maithripala Sirisena Prediction, Sri Lanka President Maithripala Sirisena, Prediction on President Death, President Death, Maithripala Sirisena Death Date, Maithripala Sirisena Astrology

Astrologer Vijitha Rohana Wijemuni who predicted Sri Lankan President Maithripala Sirisena's death arrested by Police. Later released by bail.

అధ్యక్షుడు చావలేదు.. అయినా అరెస్ట్ చేశారు

Posted: 02/02/2017 08:35 AM IST
Seer arrested after predicting leader s death

జాతకాలు, జ్యోతిష్యాలపై ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది అంత మక్కువ చూపించకపోయినప్పటికీ, పొరుగు దేశం శ్రీలంకలో మాత్రం బాగా నమ్ముతారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు వాటిపై చాలా గట్టి నమ్మకం ఉంటుంది. అలాంటిది ఆ అధ్యక్షుడి గురించే జోష్యం అది కూడా చనిపోతాడంటూ ఓ వార్త అక్కడ కలకలం రేపింది.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చనిపోతారంటూ ప్రచారం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేస్తున్న ఓ జ్యోతిష్కుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేవీలో పనిచేసే 52 ఏళ్ల విజితముని రోహన డి సిల్వ పార్ట్ టైం ఆస్ట్రాలజర్. గత ఆరు నెలల నుంచి సిరిసేన గురించి లేనిపోని వార్తలు రాస్తున్నాడు. ఈ క్రమంలో జనవరి 26న దేశ అధ్యక్షుడు చావటం ఖాయమంటూ తన బ్లాగ్ లో పేర్కొన్నాడు. అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదంలో కానీ చనిపోతాడంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేశాడు.

దీనిని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మీడియా శాఖ సెక్రటరీ నిమల్ బోపేజ్ దర్యాప్తునకు రెండు నెలల క్రితం ఆదేశించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు రోహననను అరెస్ట్ అరెస్టు చేశారు. అధ్యక్షుడు చనిపోతాడంటూ సమాజంలో లేనిపోనీ భయాలు సృష్టించటంతోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే 20లక్షల పూచీకత్తు మీద తర్వాత రోహనకు బెయిల్ మంజూరు చేశారు.
కాగా, రోహనకు జైలుకెళ్లటం కొత్తేం కాదు. 1987లో రాజీవ్ గాంధీ శ్రీలంక పర్యటన సందర్భంగా హత్యాయత్నం చేసిన కేసులో రోహనను జైలుకెళ్లి వచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Astrology  Vijitha Rohana Wijemuni  Prediction  Sri Lanka  President  Maithripala Sirisena  

Other Articles

Today on Telugu Wishesh