పాముతో వెరైటీ సెల్ఫీ.. యువతికి చుక్కలు | Pet snake gets stuck in woman's stretched earlobe.

Snake gets caught in owners earlobe

Ashley Glawe, Snake Stuck Ear Piercing, Selfie with Snake, Portland woman Selfie, Selfie Craze, Crazy Selfies, Selfie With Python, Ashley Glawe Facebook

Emergency room doctors see a lot of strange things, but even the ER staff must have been surprised when a patient arrived with a pet snake stuck in her ear piercing. Portland woman Ashley Glawe gets python stuck in her gauge piercing

వెరైటీ సెల్ఫీ ఎంత పని చేసింది

Posted: 02/02/2017 07:35 AM IST
Snake gets caught in owners earlobe

ఓరెగాన్ లోని పోర్ట్ లాండ్ లో ఓ ఆస్పత్రి. ఆష్లే గ్లేవ్ అనే యువతి వైద్యం కోసం వచ్చింది. డాక్టర్ రూంలోకి వెళ్లాక ముఖానికి చుట్టు ఉన్న ముసుగు తీసి చూపించింది. అంతే దెబ్బకి డాక్టర్ కి దిమ్మ తిరిగి పోయింది. అందుకు కారణం ఆ అమ్మాయి చెవిలోకి ఓ పాము దూరి ఉండటమే. ఎలా జరిగిందన్న ప్రశ్నకు అంతే వింతైన సమాధానం ఇచ్చింది ఆష్లే.

ఆష్లే గ్లేవ్ కు ఓ చిన్న సైజు పెంపుడు పాము ఉంది. దానిపేరు ‘బార్ట్’. దానితో ముద్దుగా ఓ సెల్ఫీ దిగాలని అనుకుంది. వెంటనే దానిని తన కుడి చెంప పక్కన పెట్టుకుని దిగాలని ట్రై చేసింది. అయితే, చెవికి పోగు కోసం ఓ పెద్ద రంధ్రాన్ని పెట్టించుకున్న ఆష్లే కు తర్వాత ఏం జరగబోతుందోనని ఊహించలేకపోయింది. కుడి చెంప పక్కన పెట్టుకున్న ఆ పాము కాస్తా, ఆ రంధ్రంలోకి వెళ్లింది. అంతే ఆ రంధ్రంలో నుంచి బయటకు రాలేక బార్ట్ నానా ఇబ్బందులు పడింది.

చాలా ప్రయత్నించిన ఆష్లే తన వల్ల వీలుకాక పోవడంతో, దగ్గరలో ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లింది. ఇక ఆష్లే చెప్పిందంతా విన్న డాక్టర్ షాక్ నుంచి తేరుకున్నాడు. రంధ్రంలో ఇరుక్కున్న పామును తీసేందుకు వైద్యులు యత్నిస్తుండగా ఆష్లే వైద్యులకు ఒక విజ్ఞప్తి చేసింది. తాను ప్రాణంగా చూసుకునే ‘బార్ట్’కు ఏమాత్రం హాని జరగకూడదని చెప్పడంతో, వైద్యులు ఆమె చెవిని కొంచెం కట్ చేసి దానిని బయటకు తీశారు. ఇక ఈ ఎక్స్ పీరియన్స్ తో ఇలాంటి సెల్ఫీలు దిగేందుకు మరెవరూ ప్రయత్నించవద్దని కోరుతూ ఆసుపత్రిలో బెడ్ మీద ఉండగానే దిగిన ఒక ఫొటోను తన ఫేస్ బుక్ ఖాతాలో ఆష్లే గ్లేవ్ పోస్ట్ చేసింది. వెరైటీ సెల్ఫీ దిగాలని భావించిన వారికి ఇదోక గుణపాఠం కావాలంటూ అందులో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Portland  Woman  Ashley Glawe  Python  Selfie  Ear Piercing  

Other Articles