వార్షక బడ్జట్ తో రియల్ రంగానికి జోష్ Affordable housing projects to be given infra status

Affordable housing projects to be given infra status

PM modi, narendra modi, arun jaitley, housing sector, 1 cr houses, PM avas yogana, demonetisation, Budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Focusing on the housing in rural and urban sector, Finance Minister Arun Jaitley, said that the government has proposed to construct 1 crore houses for the homeless by 2019.

వార్షిక బడ్జట్ తో రియల్ రంగానికి జోష్

Posted: 02/01/2017 03:29 PM IST
Affordable housing projects to be given infra status

పాత పెద్ద నోట్ల రద్దుతో తిరోగమనం బాట పట్టిన రియల్ ఎస్టేట్ రంగానికి జోష్ పెంచే కార్యక్రమానికి పూనుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గృహలపై రుణాలను మరింత చౌకగా లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు జైట్లీ బడ్జెట్లో రూ.20వేల కోట్ల గృహ రుణాలను మంజూరు చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. అదేవిధంగా హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనతో డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి.
 
అంతేకాక పెట్టుబడిదారులను ఆకర్షించనుంది.  వనరుల కేటాయింపులు పెంచడానికి ఈ స్టేటస్ ఎంతో సహకరించనుంది. దీంతో హౌసింగ్ సప్లైలు పెరిగి, డిమాండ్ తగ్గనుంది. మౌలిక సదుపాయాల కల్పినకు రూ.3,96,134 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వం అడిగిన గడువు ముగిసిన సందర్భంగా ఏర్పాటుచేసిన జాతినుద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోనే వడ్డీరేట్లు తగ్గించడానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సరసమైన గృహాల కోసం మౌలిక సదుపాయాల స్టేటస్ను కల్పించారు.  

దీంతో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019 నాటికి పేదరికాన్ని తరమికొట్చేందుకు కూడా పటిష్ట చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గానే ప్రధాన మంత్రి అవాస్ యోజనకు నిదులను భారీగా కేటాయించారు. గతంలో 15 వేల కోట్ల కింద వున్న కేటాయింపులను ఏకంగా 23 వేల కోట్లకు పెంచారు. దీంతో ఈ పథకం కింద మరో రెండేళ్లలో కోటి గృహాలను నిర్మించనున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలతో పాటు పూరిళ్లలో నివసించేవారికి కేటాయిస్తామన్నారు. దేశంలోని 50 వేల గ్రామ పంచాయితీలను పేదరికం లేని పంచాయితీలుగా తీర్చిదిద్దుతామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles