అర్థిక మంత్రి రైల్వే బడ్జెట్ ఎలా వుందంటే.. Rs one lakh crore for railway safety fund says Arun Jaitley

Rs one lakh crore for railway safety fund says arun jaitley

PM modi, narendra modi, arun jaitley, railway budget, finance minister, nda government, budget 2017-18, Union Budget 2017, financial year budget, congress, mallikarjun kharge, parliament

Union Finance Minister Arun Jaitley on Wednesday announced creation of a Railway Safety Fund of Rs one lakh crore over a period of five years.

అర్థిక మంత్రి రైల్వే బడ్జెట్ ఎలా వుందంటే..

Posted: 02/01/2017 12:26 PM IST
Rs one lakh crore for railway safety fund says arun jaitley

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్‌ను, సాధారణ బడ్జెట్‌లో కలపడం చారిత్రక నిర్ణయమని అన్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి మంగళం పాడామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం ఉంటుందని జైట్లీ తెలిపారు.

నగదు రహిత లావాదేవిలను ప్రోత్సహించేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే రైల్వే టికెట్లపై సర్వీస్‌ ట్యాక్స్‌ ను ఎత్తివేశారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసేందుకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశారు. కాలుష్యం తగ్గించేందుకు రైలు బోగీల్లో బయో టాయ్‌లెట్స్‌ పెట్టనున్నారు. అయితే గతంలో ప్రత్యేక రైల్వేబడ్జెట్ తో ఏ రాష్ట్రానికి ఏ మేరకు రైల్వే బడ్జెట్ లో కేటాయింపులు వచ్చాయన్న విషయం ఆయా రాష్ట్రాల ప్రజలకు తెలిపేదని, కానీ అర్థిక మంత్రి ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో భాగంగా ఆ వివరాలు ప్రజలకు తెలియలేదని పలువురు విమర్శించారు.

* 2017-18 రైల్వే బడ్జెట్‌ రూ.1,31,000 కోట్లు
* ఐదేళ్లలో రూ. లక్ష కోట్లతో రైల్వే భద్రత నిధి ఏర్పాటు
* ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసే రైల్వే టికెట్లకు సర్వీస్‌ ట్యాక్స్‌ ఎత్తివేత
* రైల్వేలో ప్రయాణికుల భద్రతకు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపు
* రైల్వేలు, రోడ్లు, విమానయానానికి రూ.లక్షా 31వేల కోట్లు
* 5వందల రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు కల్పించేలా చర్యలు
* అమల్లోకి కొత్త మెట్రో రైల్ విధానం..యువతకు ఉద్యోగాల కల్పన
* 2019 నాటికి అన్ని రైల్వేల్లో బయో టాయ్‌లెట్స్‌
* 7 వేల రైల్వే స్టేషన‍్లలో సోలార్‌ పవర్‌ ఏర్పాటు
* కొత్తగా 3,500 కిలోమీటర్లు రైల్వే లైన్లు
* 2020 నాటికి మానవ రహిత రైల్వే క్రాసింగులు
* ఆధ్యాత్మిక, పర్యాటకానికి ప్రత్యేకంగా రైళ్లు
* కొత్తగా మెట్రో రైలు పాలసీ ప్రకటించనున్న కేంద్రం
* ఐఆర్ సీఓఎన్, ఐఆర్ సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
* ట్రాన్స్ పోర్ట్ సెక్టార్ కు రూ. 2.41 కోట్ల కేటాయింపు
* భారత్ నెట్ ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల నిధులు
* క్లీన్ మై కోచ్ తో కోచ్ లో వున్న చెత్తను శ్రభం చేసేందుకు ఎస్ఎంఎస్ సర్వీస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : PM modi  arun jaitley  budget 2017-18  financial year budget  railway budget  parliament  

Other Articles