దాసరి ఆరోగ్య పరిస్థితి... మరో రెండు రోజులు ఆగాల్సిందేనా? | Dasari Narayana Rao condition still critical.

Health bulliten released on dasari health

Dasari Narayana Rao, Dasari Narayana Rao Health Bulliten, Dasari Narayana Rao, Dasari Health, Dasari Health Bulliten, Dasari Narayana Rao News, Dasari Narayana Rao Operation

KIMS Doctors Released Health Bulletin On Dasari Narayana Rao. Dasari Narayana Rao who is suffering with breathing problems from past few days and taking treatment in KIMS. Doctors said with the help of Ventilators the treatment is moving.

దాసరి పరిస్థితి మరీ అంత సెన్సిటివా?

Posted: 01/31/2017 06:04 PM IST
Health bulliten released on dasari health

దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యస్థితిపై రకరకాల ఊహాగానాలు రావటంతో వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. ఇన్ ఫెక్షన్ ఉన్న చోట మెట్ స్టంట్. అన్నవాహికకకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. శ్వాసకోస ఇబ్బందులతో రెండు రోజుల క్రితం తమ ఆసుపత్రి (కిమ్స్) లో చేర్చారని తెలిపారు.

ఈ సందర్భంగా చేసిన పరీక్షల్లో ఆయన అన్నవాహికలో రాపిడి ఏర్పడిందని గుర్తించామని తెలిపారు. దానికి ట్యూబ్ పెట్టి అన్నవాహిక శుద్ధి చేసి, రాపిడి దగ్గర మెటల్ స్టెంట్ వేశామని చెప్పారు. అదే సమయంలో శరీరం సహకరించక కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఫెయిల్యూర్ వచ్చిందని అన్నారు. దీంతో ఆయన కిడ్నీ పని చేసేందుకు డయాలసిస్ సహాయం తీసుకున్నామని, లంగ్స్ ఫెయిల్యూర్ సరిచేసేందుకు అన్నవాహికలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ ను తొలగించామని చెప్పారు.

 

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు లేదా మూడు రోజులు పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచి ఆయనకు చికిత్స అందించాలని, అప్పటి వరకు ఏదీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. మరోవైపు ఇది సున్నితమైన అంశమన్న సంగతి గుర్తించి, దీనిపై ఎక్కువ అడగద్దని వారు తెలపటం విశేషం. మరోవైపు దాసరిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Health  Critical  

Other Articles