130 మంది భార్యలను అనాథలు చేసి వెళ్లిపోయాడు | Nigerian man with 130 wives dies aged 93.

Former muslim preacher with 130 wives dies at 93

Nigerian Islamic Preacher, Baba Masaba, Mohammed Bello Abubakar, Nigeria's super-polygamist, 130 Wives And 200 Kids, Muslim preacher Died, Baba Masaba Death, World Biggest Family, polygamy Record

Nigerian Islamic preacher Baba Masaba who married 130 women and had at least 203 children dies aged 93.

93 ఏళ్లు.. 130 మంది భార్యలు... ఇక లేడు

Posted: 01/31/2017 03:18 PM IST
Former muslim preacher with 130 wives dies at 93

భర్త అంటే భార్యను భరించేవాడంటూ ఓ చమత్కారం పేలుస్తుంటారు పెద్దలు. కానీ, ఇక్కడో పెద్దాయన మాత్రం ఏకంగా 130 మంది భార్యలను భరించాడంటే అతిశయోక్తి కాదు. ఒక చిన్న కుటుంబాన్ని పోషించడానికే సతమతమైపోయే రోజులివి! అలాంటిది ఓ నైజీరియన్‌ వృద్ధుడు ఒకరో.. ఇద్దరో కాదు.. ఏకంగా 130 మంది భార్యలతో జీవించి రికార్డుల్లోకి ఎక్కాడు కూడా. మొహమ్మద్‌ బెలో అబూ బకర్ ఇస్లాం నైజీరియాలోని బిడా రాష్ట్ర వాసి అయిన ఓ మతబోధకుడు. దేవుడు తనని భూమ్మీదకు పంపింది జనాభా సంతానోత్పత్తికే అని బలంగా నమ్మాడు. అందుకే ఏకంగా 130 పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ఇక  93 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య కార‌ణంతో బకర్ మొన్నే క‌న్ను మూశాడు. ఒక పురుషుడు ఎన్ని పెళ్లిళ్ల‌యినా చేసుకోవ‌చ్చ‌ని గ‌ట్టిగా వాదించే ఆయ‌న‌కు 130 మంది భార్యలు, 203 మంది పిల్లలు ఉన్నారు. అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచార‌ని ఆయన సహాయకులు చెబుతున్నారు. అక్క‌డి వాసులు ఆయ‌న‌ను ‘బాబా’గా భావిస్తారు. ఆయ‌న‌ రెండంతస్తుల భారీ భవనంలో నివ‌సిస్తారు. ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా ఆయ‌న ఫ్యామిలీ రికార్డు సొంతం చేసుకుంది. ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులు ఉన్నారు.

2008లో ఆయ‌న కేవ‌లం 48 గంటల వ్యవధిలోనే 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చి వార్త‌ల్లోకెక్కారు. అయితే, ఒకేసారి అంతమందికి ఆయ‌న‌ విడాకులు ఇవ్వడాన్ని ఇతర మతపెద్దలు ఖండించారు. మొహమ్మద్‌ బెలో అబూ బకర్ మాత్రం భగవంతుడి ఆదేశాలను పాటించడానికే తాను జన్మించానని అంటుంటాడు. కొన్నిరోజుల క్రితం త‌న స‌హాయ‌కుల‌తో త‌న‌కు దేవుడు అప్పగించిన పని ముగిసిందని ఆయన వ్యాఖ్యానించాడ‌ట‌. భార్యలను భరించే శక్తి తనకు అల్లా ప్రసాదించాడంటూ ఆ మధ్య బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బకర్ పేర్కొన్నాడు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : polygamist  Nigeria  Islamic preacher  Baba Masaba  Death  

Other Articles

Today on Telugu Wishesh