అవి చూపిస్తేనే బంగారం అమ్ముతారంట! | Aadhar,PAN mandatory for gold purchase.

Aadhar and pan mandatory on gold purchases

Aadhar and PAN card, Gold Purchase India, India Gold Sellers, Gold Purchases, Gold Budget 2017, Budget 2017, Budget of India 2017, Gold Rules in India, PAN and Aadhar Gold, Gold Sellers in India

Finance Minister Arun Jaitley may make Aadhar and PAN card mandatory for gold or silver purchases over Rs 50,000 in the upcoming budget Session.

బంగారం కొనుగోలుపై కఠిన నిబంధనలు?

Posted: 01/31/2017 12:49 PM IST
Aadhar and pan mandatory on gold purchases

నోట్ల రద్దు తర్వాత పసిడి క్రయవిక్రయలపై ఓ కన్నేసి ఉంచిన ఆర్థిక శాఖ మరో నిబంధనను జారీ చేసింది. పెద్ద మొత్తంలో బంగారం లేదా వెండి ఆభరణాలను కొనడానికి వెళ్లాల‌నుకుంటున్న వారు ఇక‌పై వారితో పాటు త‌మ పాన్‌కార్డ్ లేదా ఆధార్ ను కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని స‌మాచారం.

బంగారు దుకాణాల్లో రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం విలువ‌చేసే ఆభ‌ర‌ణాలు కొనాల‌నుకుంటే కంపల్సరీ వాటిని తీసుకెళ్లాల్సిందే. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మ‌రో విధంగా ఉన్న విష‌యం తెలిసిందే. వారు బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్‌ను సమర్పిస్తున్నారు.

ఆయా మార్కెట్ల‌లో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని తెలుస్తోంది. ఇక‌పై రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ ను తీసుకొస్తారని విశ్లేష‌కులు అంటున్నారు. డీమానిటైజేషన్ అనంతరం న‌ల్ల‌ధ‌న కుబేరులు త‌మ డ‌బ్బుని ప‌లు రూపాల్లో నిల్వ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిపిన‌ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటూ వ‌స్తోన్న విష‌యం తెలిసిందే.

మరోవైపు ఏటీఎంలలో నగదు విత్ డ్రా పరిమితిని ఫిబ్రవరి ఒకటి నుంచి ఎత్తివేయాలని ఆర్బీఐ నిర్ణయించించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. బ్యాంకుల్లోనూ పరిమితిని ఆయా శాఖల విచక్షణకే వదిలేసింది. ఇక కరెంట్ అకౌంట్ క్యాష్ క్రెడిట్ అకౌంట్ - ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ల వారికి పరిమితిని పూర్తిగా ఎత్తివేసింది. ఎల్లుండి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold Purchases  India  2017  Budet  

Other Articles