మావో, టెర్రిరిస్టుల పని కాదు.. అతని పనేనా? | sudden brakes reason for Hirakhand Express accident.

Reason behind hirakhand express train mishap

Hirakhand Express Mishap, train Derailed Andhra Pradesh, Sudden Break Hirakhand train, hirakhand express accident, NIA Hirakhand and Kanpur train, Train Derailed

Officials comes to conclude on Hirakhand Express Mishap. The authorities suspect track sabotage to be the cause of the derailment. The loco pilot had said that he applied sudden brakes after hearing a loud sound.

హీరాఖండ్ ప్రమాదంపై మరో కొత్త కోణం

Posted: 01/24/2017 08:06 AM IST
Reason behind hirakhand express train mishap

హీరాఖండ్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం పై కారణాలు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. తొలుత మావోయిస్టుల దాడి, ఆపై ఉగ్రవాదుల చర్యగా అనుమానించిన అధికారులు ఎన్‌ఐఏ తో కూడిన విచారణ జరిపించిన విషయం తెలసిందే. ఇక ఇప్పుడు అసలు విషయం తేల్చినట్లు చెప్పుకుంటున్నారు. శ‌నివారం అర్ధ‌రాత్రి దాటాక జ‌గ‌ద‌ల్‌పూర్ నుంచి భువ‌నేశ్వ‌ర్‌వైపు వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజ‌య‌న‌గం జిల్లా కూనేరు రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పి 39 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. స‌డ‌న్ బ్రేక్ వేయటమే ఘోర ప్రమాదానికి కారణమని సీనియ‌ర్ రైల్వే అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా ప్ర‌ధాన‌ మార్గంలో రైలు వెళ్తున్న‌ప్పుడు లోకోపైల‌ట్ స‌డ‌న్‌గా బ్రేకు వేయ‌డం ముమ్మాటికీ త‌ప్పేన‌ని ట్రైన్స్ పాసింగ్ ఆప‌రేష‌న్ విభాగంలో ముఖ్య ర‌వాణా అధికారిగా ప‌నిచేసి రిటైరైన అధికారి ఒక‌రు తెలిపారు. మెయిన్ లైన్‌లో రైళ్లు గంట‌ల‌కు 70-80 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంటాయ‌ని, అలాంటి స‌మ‌యంలో స‌డ‌న్ బ్రేక్ వేయ‌డం వ‌ల్ల ఇటువంటి ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కూనేరు క్రాసింగ్ పాయింట్ వ‌ద్ద రైలు వెళ్లే ప‌ట్టా అడుగు మేర విరిగిపోయింది. ఇది గ‌మ‌నించని డ్రైవ‌ర్ రైలును పోనిచ్చాడు. రైలులోని స‌గం బోగీలు విరిగిపోయిన ప‌ట్టా నుంచి సుర‌క్షితంగా వెళ్లిపోయాయి. అయితే ఆ త‌ర్వాత కాసేప‌టికే పెద్ద శ‌బ్దం రావ‌డంతో పైల‌ట్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. దీంతో వెన‌క బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ఒక‌దానిపైకి ఒక‌టి ఎక్కేశాయి. ప‌క్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. డ్రైవ‌ర్ క‌నుక స‌డ‌న్ బ్రేక్ వేయకుంటే ముందు బోగీల్లానే వెన‌క బోగీలు కూడా దాటేసి సుర‌క్షితంగా దాటి ఉండేవ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఒక‌వేళ ప‌ట్టాలు త‌ప్పినా అదేవేగంతో కొంత‌దూరం వెళ్లి ఆగిపోయి ఉండేవంటున్నారు. దీనివ‌ల్ల ప్ర‌మాద తీవ్ర‌త చాలావ‌ర‌కు త‌గ్గేద‌ని అంటున్నారు. డ్రైవ‌ర్ భ‌యంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని, స‌డ‌న్ బ్రేకే కొంప ముంచింద‌ని చెబుతున్నారు. మెయిన్‌లైన్‌లో వెళ్తున్న‌ప్పుడు స‌డ‌న్ బ్రేక్ వేయ‌కూడ‌ద‌నే విష‌యం లోకో పైల‌ట్ కు తెలీకపోవటం వల్లే ఇంత ఘోరం జరిగిందని వారంటున్నారు. అయితే అదే ట్రాక్ పై అంతకు ముందు ఓ గూడ్స్ ట్రెయిన్ వెళ్లటం గురించి మాత్రం వారి దగ్గరి నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hirakhand Express  Accident  Andhra Prdesh  

Other Articles