బీజేపీని సమూలంగా నాశనం చేయటమే ఆయనకున్న పని | Naresh Agarwal breaks silence on leaving SP.

Naresh agarwal strikes down rumours of joining bjp

Samajwadi Party, Naresh Agarwal, Uttar Pradesh, Naresh Agarwal BJP, Akhilesh Yadav Naresh Agarwal, Naresh Agarwal Akhilesh Yadav, Naresh Agarwal BJP, SP key leader BJP, Mulayam Singh Yadav Naresh Agarwal

Samajwadi Party's senior leader Naresh Agarwal rubbishes reports of defecting to BJP. Says he only with Akhilesh Yadav'.

బీజేపీని నాశనం చేయటమే నా లక్ష్యం

Posted: 01/23/2017 01:29 PM IST
Naresh agarwal strikes down rumours of joining bjp

యూపీ ఎన్నికలకు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలు సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. ఓవైపు ములాయం ఇంట ముసలం, మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు, ఇదిలా ఉండగానే పార్టీ సీనియర్ నేత ఒకరు పార్టీ మారతారన్న వార్త సమాజ్ వాదీ పార్టీలో కలకలమే రేపింది. ములాయం సింగ్ కు కుడి భుజం అయిన నరేష్ అగర్వాల్ బీజేపీలో చేరబోతున్నట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కీలక నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆయన్ని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.

అయితే, ఈ వార్తలను నరేశ్ అగర్వాల్ తీవ్రంగా ఖండించారు. తాను బీజేబీలో చేరుతున్న మాట అవాస్తవమని... తాను అఖిలేష్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీని సమూలంగా అంతమొందించడమే తన లక్ష్యమని తెలిపారు. సమాజ్ వాదీ పార్టీ పాలనలోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి దిశగా సాగుతుందని చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా అదంతా రూమరే అని తేల్చేసింది.

కాగా, ఎస్పీ వ్యవస్థాపకుల్లో ఒకడైన నరేశ్ అగర్వాల్ ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఎన్నికయ్యాడు. ములాయం సింగ్‌ యాదవ్‌కు అత్యంత ఆప్తుడైన ఈ నేత ఇంతకు మధ్యలో కొంతకాలం కాంగ్రెస్ లో కూడా పనిచేశాడు. ములాయం వర్సెల్ అఖిలేశ్ వార్ సమయంలో ఆయన తనయుడి పక్షానే నిలిచి హైలెట్ అయ్యాడు కూడా. కాగా, కాంగ్రెస్ తో పొత్తులో ఈయనే కీలక పాత్ర పోషించి ఉంటాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకు ముందు ములాయం సన్నిహితుడు అమర్ సింగ్ కూడా బీజేపీలో చేరుతున్నాడనే వార్త వినిపిస్తున్నప్పటికీ, దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samajwadi Party  Naresh Agarwal  BJP  Rumour  

Other Articles

Today on Telugu Wishesh