సోషల్ మీడియా పుణ్యమాని లొల్లి పెద్దగయ్యిందోచ్ | With Social Media, Jallikattu Protest became larger.

Jallikattu protest on chennai marina beach

Tamil Nadu news, Jallikattu protests, Panneerselvam Modi, Social Media, Jallikattu, Marina Beach protest, Jallikattu PETA, PETA ban Tamil Nadu, PETA Jallikattu, Jallikattu agitation

Jallikattu protests spread across Tamil Nadu, Panneerselvam to meet Modi.

జల్లి కట్టు.. లొల్లి పెట్టు...

Posted: 01/19/2017 09:13 AM IST
Jallikattu protest on chennai marina beach

తమిళనాట జల్లికట్టు పెడుతున్న మంట అంతా ఇంతా కాదు. తమ ప్రాచీన క్రీడపై నిషేధం విధించడాన్ని జీర్ణించుకోలేని యావత్ తంబీలు ఒకచోట చేరి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాని మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళన రేంజ్ పెరిగిపోగా, పెద్ద స్థాయిలో యువత అక్కడికి చేరుకోవటం, పైగా స్వల్ఫ లాఠీ ఛార్జీ జరగటంతో ఆందోళన తారా స్థాయికి చేరింది. ఇది ముమ్మాటికీ తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అంటూ సాగరతీరాన రచ్చ రేగుతోంది. ఏకంగా అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఉద్యమం పై కథనాలు ప్రచురించే స్థాయికి చేరుకుంది.

మంగళవారం నుంచే వేలాది మంది యువకులు మెరీనా బీచ్‌ వద్ద ఆందోళన చేపట్టారు. 200కు పైగా ప్రముఖ కాలేజీలు, వర్సిటీలకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించగా, వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి బీచ్‌కు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ సహా అన్ని పార్టీల, కోలివుడ్‌ మద్దతు తోడవడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ ఆందోళనలు పెరగడంతో తమిళసర్కారు అప్రమత్తమైంది. మరోవైపు సుప్రీం కోర్టు తుది ఆదేశాలు వచ్చేదాకా ఇందులో జోక్యం చేసుకోకూడదని కేంద్రం భావిస్తోంది.

పెటాకు ముడిందా?
జల్లికట్టును నిషేధించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జంతుహక్కుల సంస్థ పెటాపై ఆందోళనకారులు విరుచుకుపడుతున్నారు. తక్షణం ఆసంస్థను మూసివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలంగనల్లూర్, మధురైలోని తమ్ముక్కం గ్రౌండ్స్‌లోనూ యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శివగంగ జిల్లాలోని కందిపట్టి గ్రామంలో 100 ఎడ్లతో నిర్వహిస్తున్న మంజు విరాట్టు (ఎద్దులను లొంగదీసుకోవడం) ఉత్సవాన్ని అడ్డుకొని పోలీసులు లాఠీఛార్జి చేయడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. నటుడు విశాల్, కమెడియన్‌ వివేక్, శివకార్తికేయన్‌తో సహా పలువురు జల్లికట్టుకు మద్దతు ప్రకటించారు. ఈవిషయమై జనవరి 20న ధర్నా చేస్తున్నట్లు దక్షిణ భారత సినీనటుల సంఘం ప్రకటించింది. జల్లికట్టు ఉద్యమాన్ని విదేశాల్లోని తమిళులు సైతం బలపరుస్తూ ఆందోళనలు చేపట్టారు. అమెరికా, లండన్, సింగపూర్, కెనడా దేశాల్లో వందలాది మంది తమిళులు బుధవారం ఉదయం ఆందోళనలు నిర్వహించారు.

మరోవైపు అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర రావణ కాష్టంలా రగులుతోందని, ఇది మరింత ముదరక ముందే కలగచేసుకోవాలని న్యాయవాది కె. బాలు బుధవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మెరీనా బీచ్‌ ఏమీ ధర్నాస్థలం కాదని పేర్కొన్న కోర్టు, సర్వోన్నత న్యాయస్థానం నిషేధించినందున హైకోర్టుగాని, తమిళనాడు ప్రభుత్వంకాని ఏమీ చేయలేవని తేల్చి చెప్పింది.

జల్లికట్టుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతు ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం ప్రకటించారు. జల్లికట్టు సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున వెంటనే ఆందోళన విరమించాల్సిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు.మరోవైపు జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు అన్నాడీఎంకే ఎంపీలతో కలిసి సీఎం పన్నీర్‌ సెల్వం గురువారం ప్రధానిని కలవనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Marina Beach  Agitation  PETA  

Other Articles