మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన చిన్నబాబు nara lokesh says no to mlc post

Nara lokesh gives clarity on minister post

nara lokesh, ap assembly elections, cabinet expansion, mlc elections, telugu desam party, ntr death anniversary, ntr museum, siddartha collage, vijayawada

TDP national general secretary Nara Lokesh gives clarrity on minister post, says he will be abide by the party decision. He also says if party orders will contest comming andhra pradesh elections.

మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చిన చిన్నబాబు

Posted: 01/18/2017 12:35 PM IST
Nara lokesh gives clarity on minister post

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తాను ఒకడిగా పగ్గాలను అందుకోబోతున్నారన్న వార్త ఇటీవలి కాలంలో బాగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో.. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తాను రాష్ట్ర మంత్రిగా బాద్యతలు చేపడుతున్నానన్న వార్తుల్లో నిజం లేదని, ఈ మేరకు మంత్రివర్గంలో ఎలాంటి చర్చ కూడా జరగలేదని క్లారిటీ ఇచ్చేశారు చిన్నబాబు. కాగా, ఈ విషయంలో కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని పురస్కరించుకుని సిద్దార్థ కళాశాలలో ఎన్టీఆర్ మ్యూజియాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇక తాను ఎమ్మెల్సీగా ఎన్నికవుతానన్న వార్తలు కూడా ఊహాగానాలేనని తేల్చిచెప్పారు టీడీపీ యువనేత. అయితే ఇదే క్రమంలో మరో విషయంపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. పార్టీ ఆదేశిస్తే తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ తనకు ఏ బాధ్యతలను అప్పింగించినా.. దానికి కట్టుబడి ఉంటానని నారా లోకేష్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles