బస్సులో యువతిపై కండక్టర్ లైంగిక వేధింపులు BMTC drivers, conductors trip on sensitivity score

Woman sexually harassed in bmtc bus driver conductor arrested

Woman sexually harassed, conductor, Bengaluru police, South Bengaluru, Facebook post, BMTC bus conductor, Bengaluru news, crime news

City police detained a conductor and a driver of Bangalore Metropolitan Transport Corporation (BMTC) on charges of sexual harassment of a working woman on moving bus.

బస్సులో యువతిపై కండక్టర్ లైంగిక వేధింపులు

Posted: 01/14/2017 11:43 AM IST
Woman sexually harassed in bmtc bus driver conductor arrested

బెంగుళూరు సిలికాన్ వ్యాలీలో న్యూఇయర్ రోజున జరిగిన బహిరంగ లైంగిక వేదింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపినా.. ఇంకా అక్కడి ప్రజల్లో మాత్రం మార్పు వచ్చినట్లు కనబడటం లేదు. టికెట్‌ ఖరీదు పోనూ మిగతా చిల్లర ఇవ్వాలని అడిగిన యువతి పట్ల బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(బీఎంటీసీ) బస్సు కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. లవ్‌ లెటర్‌ ఇస్తే చిల్లర ఇస్తానని చెబుతూ లైంగిక వేధింపులకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వివరాలను ఫేస్‌బుక్‌లో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ కేసులో ఇలాగే జరిగిందంటూ ఆ పోస్ట్‌లో ఉదహరించింది.

అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పాటు బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరగటంతో ఆమె తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ను తొలగించింది. కాగా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సౌత్‌జోన్‌ డీసీపీ డాక్టర్‌ శరణప్ప నిన్న మీడియాకు వెల్లడించారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి జనవరి 10న రాత్రి 8.30 గంటల సమయంలో విధులు ముగించుకొని రాగిగుడ్డ బస్టాప్‌ నుంచి ఉత్తరహళ్లికి వెళ్లే బస్సు ఎక్కింది.

బస్సు బనశంకరి బస్టాండుకు చేరుకోగానే చాలా మంది దిగేశారు. దీంతో తనకివ్వాల్సిన చిల్లర ఇస్తే దిగిపోతానని చెప్పింది. ఈ సందర్భంలో కండక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. భయాందోళనకు గురైన యువతి బస్సు ఆపాలని కోరినప్పటికీ డ్రైవర్‌ కూడా పట్టించుకోలేదు. తనకు లవ్‌ లెటర్‌ ఇస్తే చిల్లర ఇస్తానని కండక్టర్‌ వేధించాడు. వెనుక సీట్లలో కూర్చున్న నలుగురు యువకులు ముందుకొచ్చి యువతికి అండగా నిలబడటంతో కండక్టర్‌ వెనక్కి తగ్గి మిగతా చిల్లర ఇచ్చాడు. అప్పుడు కూడా ఆ యువతి చేతులు తాకి అసభ్యంగా వ్యవహరించాడు.

బస్సు దిగాక సదరు యువతి ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు కండక్టర్‌తో పాటు బస్సు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా బస్సులో యువతిపై వేధింపులకు పాల్పడలేదని డ్రైవర్‌, కండక్టర్‌ తెలిపారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు బీఎంటీసీ ఎండీ అందుబాటులో లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Woman  sexual harassment  conductor  BMTC bus  crime news  

Other Articles