టూమచ్: టీవీ రిమోట్ దొంగతనం.. శిక్ష ఎంతో తెలుసా? | Man steals TV remote gets 22 years in jail.

Illinois man gets 22 years in prison for stealing tv remote

TV remote, Eric Bramwell, Remote theft, Remote steal big punishment, 22 years punishment, TV remote thief, Man steals TV remote, Illinois man TV remote, Chicago remote theft

Man from Illinois gets 22 years in prison for stealing a TV remote.Eric Bramwell is sentenced to 22 of prison, but all he did was steal a remote.

టీవీ రిమోట్ ఎంత పని చేసింది!

Posted: 01/09/2017 12:54 PM IST
Illinois man gets 22 years in prison for stealing tv remote

చిన్న తప్పుకు పెద్ద శిక్ష అంటే ఏంటో ఈ ఘటన నిరూపిస్తుంది. ఈ కథనం చదివాక మరి అతగాడికి ఆ శిక్ష సరైందో? కాదో? మీరే నిర్ణయించండి. 35 ఏళ్ల ఎరిక్ బ్రామ్ వెల్ ఓ దొంగ. గతంలో చాలాసార్లు తన చాతుర్యం చూపి జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. చివ‌రికి ఈ మధ్య మరోసారి చిక్కి, ఏకంగా 22 ఏళ్ల జైలు శిక్షను అనుభవించబోతున్నాడు. అసలు అంత కఠిన శిక్ష పడటానికి కారణం ఏంటి? ఏం దొంగతనం చేశాడతను తెలుసుకుందాం పదండీ...

రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో 100 బ్లాక్ ఆఫ్ క్రాస్ వీధిలోని ఓ అపార్ట్ మెంట్లో చోరీచేశాడు. చోరీ అంటే ఏ బంగార‌మో న‌గ‌దో కాదు టీవీ రిమోట్‌ను చోరీ చేశాడు. అనంత‌రం అక్కడినుంచి తప్పించుకున్నాడు. ప‌దేప‌దే ఓ దొంగ‌ ఇలాంటి చోరీలకే పాల్పడుతుండ‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లో వేలిముద్రలు, కొన్ని వివరాలు సేకరించి, ఎరిక్ వేలిముద్రలు, డీఎన్‌ఏతో వాటిని పోల్చి చూశారు. చివ‌రికి ఇటువంటి చోరీల‌కు పాల్ప‌డుతోంది అత‌డే అని గుర్తించి అత‌డిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. తాను ఆ అపార్ట్‌మెంటులో రిమోట్ చోరీచేసినట్లు ఎరిక్ ఒప్పుకున్నాడు.

అయితే కేవలం రిమోట్ దొంగతనానికే అతనికి ఇంతటి శిక్ష వేయలేదని స్టేట్స్ అటార్నీ రాబర్ట్ బెర్లిన్ తెలిపాడు. ఇటువంటి ప‌లు చోరీలకు పాల్పడి జైలుకి వెళ్లి వచ్చాక కూడా అతనిలో నేరవృత్తిని వదిలేయాలన్న పరిణితి లేకపోవటంతోనే ఈ శిక్ష విధిస్తున్నట్లు తెలిపాడు. ప‌దేళ్ల శిక్ష అనుభ‌వించిన త‌రువాత అతడికి పెరోల్ అవకాశం కల్పిస్తున్న‌ట్లు కోర్టు తెలిపింది. అదే సమయంలో ఆ దొంగ‌ చేసిన తప్పిదాలన్నింటినీ తీసుకుంటే అతడికి 30 ఏళ్ల వరకు శిక్ష వేయాలి. కానీ, పెద్ద మనసుతో అతనికి తక్కువ శిక్ష విధించినట్లు తెలిపారు. జైల్లో అతన్ని టీవీకి దూరంగా ఉంచండంటూ జైలు అధికారులతో జడ్జి జోక్ చేయటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV remote  Man  punished  22 years  

Other Articles