మరో దారుణ వీడియో: యువతితో అసభ్యప్రవర్తన, నాలుక కోరికి, ఒంటిపై గాట్లు | Third case of sexual harassment surfaces from Bangalore.

Another molestation video in bangalore

burqa-clad woman, Third case of sexual harassment, Bangalore harassment, Bangalore molestation, Bangalore Burqa woman molestation, Bangalore Molestation city

A 23-year-old burqa-clad woman was allegedly molested and attacked by a man while she was walking towards bus stop around 6.45 am. The incident took place in Bengaluru's KG Hills area and the victim's tongue was also bitten. This incident was also captured by a CCTV camera.

ITEMVIDEOS:బయటపడిన మరో వేధింపుల వీడియో

Posted: 01/07/2017 04:48 PM IST
Another molestation video in bangalore

సిలికాన్ సిటీ లో మరో దారుణం. మహిళలకు ఏ మాత్రం భద్రత లేదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కొత్త సంవత్సరం నుంచి వెలుగు చూస్తున్న కామాంధుల వికృత చేష్టలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కమ్మనహళ్లి ప్రాంతంలో ఒంటరిగా ఇంటికి వెళ్తున్న ఓ యువతిని ఇద్దరు బైక్ పై వచ్చి అడ్డగించి, అందులో ఒకడు చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో చూశాం. అంతేకాదు బైక్ పై తీసుకెళ్లేందుకు యత్నించి కుదరకపోగా, అక్కడే పడేసి పారిపోయారు. అలాంటిదే రీసెంట్ గా మరో ఘటన సీసీ పుటేజీ ద్వారా బయటపడింది.

బెంగళూరులోని కేజీ హాలి ప్రాంతంలో బురఖా ధరించి రోడ్డుపై నుంచి వెళుతున్న ఓ యువతిపై ఒక వ్యక్తి అకార‌ణంగా దాడి చేశాడు. కొద్దిసేపు ఆ యువతిని వెంబడించిన ఆ కామాంధుడు అనంత‌రం ఆమెను పట్టుకొని వేధించాడు. ముద్దుపెట్టుకుని, ఎక్కడ పడితే అక్కడ తాకాడు. పెదవులను, నాలుకను కొరికి కిరాతకంగా వ్యవహరించాడు. చివ‌ర‌కి ఆమెను నేలపై తోసివేశాడు.

 

ఆమె అరుపులకు వీధికుక్కలు పెద్దగా అరవడంతో స్థానికులు వ‌స్తార‌న్న భ‌యంతో ఆ నిందితుడు యువతిని వదిలేసి చిన్నగా అక్కడి నుంచి పరార‌య్యాడు. ఈ ఘ‌ట‌న అంతా అక్క‌డి సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మయింది. కాసేపటికి అటుగా వచ్చిన కొందరు ఆమెను గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత యువ‌తి కాళ్లు, చేతులు, నాలుకకు తీవ్ర‌గాయాలు కావ‌డంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ మృగాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. కాగా, వేధింపుల తర్వాత పోకిరీల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చినప్పటికీ శుక్రవారం ఈ దాడి జరగటం కలకలం రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Woman  Molestation  Video  

Other Articles