ఎమ్మెల్యే బాడీగార్డ్ అకౌంట్లో రూ. 100 కోట్లు Rs 100 cr deposit in SP MLA bodyguard's account

Rs 100 cr deposit in sp mla bodyguard s account

Samajwadi Party, SP MLA, Bodyguard, Gunner, Irfan Solanki, SBI, Kanpur, Ghulam Jilani, Kanpur District Magistrate, Kaushal Raj Sharma, Padrauna, Kushinagar district, uttar pradesh

A bodyguard of Samajwadi Party MLA saw in shock when he saw Rs 100 crore in his account.

ఎమ్మెల్యే బాడీగార్డ్ అకౌంట్లో రూ. 100 కోట్లు

Posted: 01/04/2017 08:29 PM IST
Rs 100 cr deposit in sp mla bodyguard s account

సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రోగిన వేళ.. అందరి దృష్టి నెలకొన్న అత్యంత పెద్ద రాష్ట్రం అత్యధిక అసెంబ్లీ స్థానాలు వున్న ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బాడీగార్డ్‌ ఖాతాలో ఏకంగా రూ. 100 కోట్లు డిపాజిట్‌ కావడం కలకలం రేపుతోంది. ఎస్పీ ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకీ బాడీగార్డు గులాం జిలానీ ఎస్బీఐ ఖాతాలో అతనికి తెలియకుండానే రూ. 100 కోట్లు డిపాజిట్‌ అయ్యాయి. గత రాత్రి ఏటీఎంకు డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన జిలానీ తన ఖాతాలో దాదాపు రూ. 100 కోట్టు ఉన్నట్టు వివరాలు రావడంతో కంగుతిన్నాడు.

కాన్పూర్‌లోని మాల్‌రోడ్డులోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో అతనికి ఖాతా ఉంది. అతని ఖాతాలో గుర్తుతెలియని వ్యక్తులు 99కోట్ల 99 లక్షల 02వేల 724 రూపాయలు డిపాజిట్‌ చేశారు. ఇంత డబ్బు తన అకౌంట్లో జమకావడంతో షాక్ కు గురైన బాడీగార్డ్.. వెంటనే ఈ విషయాన్ని తన యజమాని..  ఎమ్మెల్యే సోలంకి దృష్టికి తీసుకువచ్చాడు. సోలంకి ఈ విషయమై కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ కుషాల్‌ రాజ్‌ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samajwadi Party  SP MLA  Bodyguard  Gunner  Irfan Solanki  SBI  Kanpur  Ghulam Jilani  

Other Articles