దోమ కుడితే యాక్సిడెంటేనా? డబ్బులు ఇవ్వాల్సిందే! | Death due to mosquito bite is an accident.

Death by mosquito bite an accident and insurer must pay up

National Consumer Disputes Redressal Commission, Mosquito death India, India Mosquito death, mosquito bite an accident, mosquito death insurance, mosquito bite claim,

National Consumer Disputes Redressal Commission says Death by mosquito bite an accident, insurer must pay up.

దోమ కుట్టి పోయినా ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే!

Posted: 01/02/2017 09:32 AM IST
Death by mosquito bite an accident and insurer must pay up

ప్రమాదాల్లో మరణించిన వారికి వాళ్ల వాళ్ల ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా డబ్బులు రావటం అనేది తెలిసిందే. అయితే ఇక్కడ దొమకాటును ద్వారా మనిషి చనిపోతే అది కూడా యాక్సిడెంట్ కిందకే వస్తుందని ఓ సంచలన ఆదేశాలు జారీ చేసింది జాతీయ వినియోగ‌దారుల వివాద పరిష్కార కమిషన్. దోమ కాటు కూడా ప్ర‌మాదం(అనుకోకుండా జరిగేదే కాబట్టి) కిందికే వ‌స్తుంద‌ని, కావున దోమ కాటు కార‌ణంగా మ‌ర‌ణించిన వారికి బీమా సొమ్ము చెల్లించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన మౌస‌మీ భ‌ట్టాచార్జీ అనే మహిళ భ‌ర్త దేవాశిష్ 2012లో దోమకాటుతో మలేరియా వచ్చి చనిపోయాడు. దీంతో ఆమె కేసు నమోదు చేయగా, విచార‌ణ సంద‌ర్భంగా వినియోగ‌దారుల క‌మిష‌న్ ఈ తీర్పు చెప్పింది.‘‘దోమ మ‌న‌కు చెప్పి కుట్ట‌దు కాబ‌ట్టి, దానిని అక‌స్మాత్తుగా జ‌రిగిన ప్ర‌మాదంగానే భావించాల‌ని పేర్కొంది. దోమ‌కాటు మ‌ర‌ణాల‌ను ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన మృతిగా అంగీక‌రించ‌డం కొంచెం క‌ష్ట‌మైన ప‌నే అయినా దోమ కుడుతుంద‌ని ఎవ‌రూ ముందుగా ఊహించ‌రు కాబ‌ట్టి అది ప్ర‌మాదం కిందికే వ‌స్తుంద‌ి’’ అని తేల్చి చెప్పింది. కావున ఆ మ‌ర‌ణాల‌కు బీమా సొమ్ము చెల్లించాల్సిందేన‌ని పేర్కొంది.

బీమా కంపెనీలు త‌మ వెబ్‌సైట్ల‌లో కుక్క‌కాటు, గ‌డ్డ‌క‌ట్టే చ‌లికి చ‌నిపోవ‌డం వంటి వాటిని మాత్ర‌మే ప్ర‌మాదాలుగా పేర్కొన్నాయ‌ని, కానీ దోమ‌కాటు కార‌ణంగా వ‌చ్చే మ‌లేరియాను వ్యాధిగానే ప‌రిగ‌ణిస్తున్నాయ‌ని పేర్కొంది. ఇక నుంచి దీనిని కూడా ప్ర‌మాదంగానే ప‌రిగ‌ణించాల‌ని, బీమా సొమ్మును చెల్లించాల‌ని జ‌స్టిస్ వీకే జైన్ ఆదేశించారు. గతంలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా 2014 ఫిబ్రవరిలో అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర ఫోరాన్ని ఆశ్రయించగా వ్యాజ్యాన్ని కొట్టివేసింది. దీంతో కంపెనీ జాతీయ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుని చివరకు విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : National Consumer Disputes Redressal Commission  Mosquito Bite  Death  Claim  

Other Articles

Today on Telugu Wishesh