జయమ్మకు నివాళులు.. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు.. shashikala natarajan unanimously elected aiadmk party chief

Hashikala natarajan unanimously elected aiadmk party chief

aiadmk, shashikala natarajan, general secretary, panner selvam, chief minister, AIADMK General Body meeting, Sasikala Natarajan, chennai, party general body meet, tamilnadu

aiadmk party unanimously elected shashikala natarajan as party general secratary and declared to work under her leadership

జయమ్మకు నివాళులు.. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు..

Posted: 12/29/2016 11:00 AM IST
Hashikala natarajan unanimously elected aiadmk party chief

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకస్మిక మరణంతో తమిళనాడులో శరవేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అయితే తమిళనాడులో రాజకీయానికి తెరవెనుక కేంద్రం అండదండలున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 5న జయలలిత మరణించిగానే అర్థరాత్రి అఘమేఘాల మీద ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పన్నీరు సెల్వం, ఇక పార్టీ పగ్గాలను చిన్నమ్మకు కట్టబెట్టాలని కూడా నిశ్చయించుకున్నారు. దీంతో సుమారు 23 రోజుల తరువాత పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి.. చిన్నమ్మ శశికళ నటరాజన్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.

తొలుత ఈ విషయాన్ని అధికారికంగా పార్టీ వెబ్ సైట్ లో పార్టీ వెల్లడించింది. ఆ తరువాత సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. శశికళ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. అయితే అధికారికంగా జనవరి 2న శశికళ పార్టీ పగ్గాలను అందుకోనున్నారు. పార్టీ సీనియర్ నేత మధుసూదన్ నాయకత్వంలో అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది.

ముందుగా దివంగత నాయకురాలు జయలలితకు నివాళి అర్పించారు. ఈ సర్వసభ్య సమావేశంలో 14 తీర్మానాలు ఆమోదించారు. జయలలిత పుట్టినరోజును జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానం చేశారు. అమ్మకు భారతరత్న ఇవ్వాలని కూడా తీర్మానం ఆమోదించారు. పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నేతలు తీర్మాణం చేశారు. దీంతో పాటు మెగసెసె అవార్డు, నోబెల్‌ శాంతి పురస్కారానికి జయలలిత పేరును ప్రతిపాదించాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు తీర్మానించారు.

అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను కూడా పోటీచేస్తానంటూ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ప్రకటించిన నేపథ్యంలో చిన్నమ్మ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శశికళకు ఇబ్బంది కలిగేలా కొంచెం కూడా వ్యతిరేకత కనపడకుండా చిన్నమ్మ వర్గం అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు. ఈ భేటీకి 2200 మందిని మాత్రమే ఆహానించారు. శశికళపై వ్యతిరేకత ఉన్నవారికి ఆహ్వానం అందలేదు. వారిని పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే పార్టీ కార్యాలయంలోకి వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సమావేశ వేదికపై జయలలిత కోసం ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారు. దారిపొడవునా జయలలిత, శశికళ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles