తన పేరును ఉపయోగించవద్దని బీజేపి ఎంపీకి క్రికెటర్ సూచన Kambli rejects BJP MP’s claim of discrimination in cricket

Vinod kambli rejects bjp mp s claim of discrimination in cricket owing to dalit background

vinod kambli, kambli, udit raj, bjp mp, bjp mp kambli, kambli discrimination controversy, dalit discrimination in cricket, cricket discrimination, india news, latest news

BJP MP from Delhi Udit Raj had claimed that Vinod Kambli's Dalit background was the reason he never found success in cricket.

తన పేరును ఉపయోగించవద్దని బీజేపి ఎంపీకి క్రికెటర్ సూచన

Posted: 12/28/2016 08:12 PM IST
Vinod kambli rejects bjp mp s claim of discrimination in cricket owing to dalit background

మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి దళితుడు కావడం వల్లే.. ఆయన క్రికెట్‌ నుంచి కనుమరుగు అయ్యారని దుమారం రేపిన ఢిల్లీకి చెందిన బీజేపి ఎంపీ ఉదిత్ రాజ్ కు ఓ చక్కని సూచన వచ్చింది. దళితుడినని ఒప్పుకోవడంలో వినోద్‌ కాంబ్లీ సిగ్గుపడకూడదని, అయితే దళితడన్న కారణంగానే అతను క్రికెట్‌ నుంచి కనుమరుగు కావాల్సివచ్చిందని ఆయన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదంగా మారాయి.

ఇలా ట్విట్ చేసిన ఎంపీ ఉదిత్ రాజ్ తీరుపై విమర్శలు వ్యంగ్యాస్త్రాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ.. దేశంలోని వర్గాల మధ్య వైషమ్యాలకు దారి తీసేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసమా..? అంటూ నెట్ జనులు కూడా ఆయనను తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మరొకరు ట్విట్టర్‌లో ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

ఇదలావుండగా తనపై వ్యాఖ్యలు నేపథ్యంలో మాజీ టీమిండియా క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా స్పందించారు. పార్లమెంటు సభ్యడు అందునా అధికార బీజేపికి చెందిన ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన చాలా హుందాంగా స్పందించారు. తన కులానికి క్రికెట్ కెరీర్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కోన్న కాంబ్లీ.. ఇకపై తన పేరును ఉపయోగించకూడదని అన్నారు. 'మిస్టర్‌ రాజ్‌..మీ ప్రకటనలను నేను సమర్థించడం లేదు. కాబట్టి దయచేసి నా పేరును ఇకముందు ఉపయోగించకండి' అంటూ బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinod kambli  udit raj  bjp mp  dalit  discrimination  cricket  

Other Articles