పురచ్చితలైవి బతికివుంటే ఈ సాహసం చేసేవారా..? Ram mohan rai comdemns IT raids on his office

Ram mohan rai comdemns it raids on his office

rammohan rao, tamil nadu, chief secretary, chennai, it raids, vivek, girija vaidhanathan, shekar reddy, rahul gandhi, mamata banerjee, dmk mp veeram

Tamil Nadu ex CS Rammohan Rao condemned IT raids on his Tamil Nadu Cheif Secratary office without search warrant.

ITEMVIDEOS: పురచ్చితలైవి బతికివుంటే ఈ సాహసం చేసేవారా..?

Posted: 12/27/2016 11:14 AM IST
Ram mohan rai comdemns it raids on his office

తన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన అధికారులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బతికివుంటే ఇంత సాహసానికి కేంద్రం పాల్పడేదా అని మండిపడ్డారు. తన కార్యాలయం, ఇళ్లపై సోదాలు జరిపిన ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన కార్యాలయం, ఇంటిపై ఐటీ దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందన్నారు. కేంద్రం కూడా కావాలనే దాడులు జరిపిందని అరోపించారు

అమ్మ అకస్మిక మరణంతో తమిళ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తన ఇంట్లో ఐటి అధికారులకు లక్షా పన్నెండు వేల రూపాయలతో పాటు తన భాక్యకు చెందిన 40 తులాల బంగారం మాత్రమే లభించాయన్నారు. 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. తన ఇంట్లో సోదాల నేపథ్యంలో తనను 26 గంటలపాటు హౌస్ అరెస్టు చేసి, సోదాలు నిర్వహించారని ఆయన అన్నారు. తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ ఉంటే, తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్ కు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.

ఎవరి అనుమతితో సిఎస్ కార్యాలయంలోకి ఐటి అధికారులు ప్రవేశించారని అడిగారు. తన కుమారుడు వివేక్ పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి సోదాలు చేశారని, తన కుమారుడు ఏమైనా చీఫ్ సెక్రటిరీయా అన్నారు. తనను లక్ష్యం చేసుకున్నారని, తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. తన కుమారుడిని కూడా టార్గెట్ చేశారని అన్నారు. తన కుమారుడి ఇంట్లోకి వెళ్లి తుపాకి గురి పెట్టారని, తన కుమారుడు ఏమైనా నేరస్థుడా అని అన్నారు. తాను శేఖరరెడ్డికి సంబంధించిన ఏ లావాదేవీలోనూ కల్పించుకోలేదని అన్నారు. తన కుమారుడికి అతనితో వ్యాపారలావాదేవీలు లేవన్నారు.

సిఎస్ కార్యాలయంపై దాడులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటిరీని అని ఆయన అన్నారు. కొత్త సిఎస్ నియామకం చెల్లదని అన్నారు. తనకు ట్రాన్సఫర్ ఆర్డర్స్ ఇచ్చే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన చెప్పారు. తన కొడుకు పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 32 ఏళ్ల పాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles