జియో ‘మార్చి’ పై కొత్త వివాదం.. అనుమతులు ఎలా వచ్చాయసలు? | How Jio to continue promo offer till March

Bharti airtel moves tdsat against trai

Reliance Jio, Jio promo offer, Bharti Airtel, TDSAT, Bharti Airtel Jio, TRAI Reliance Jio, March Jio Welcome Offer, Jio Welcome Offer, Vodafone and Airtel Jio offer

Airtel challenges TRAI's permission to Jio to continue promo offer till March.

జియో మార్చి ఆఫర్ : ట్రాయ్ పైనే కేసు!

Posted: 12/24/2016 10:40 AM IST
Bharti airtel moves tdsat against trai

ఉచిత ఆఫ‌ర్‌తో ఇత‌ర నెట్‌వ‌ర్క్ కంపెనీల న‌డ్డివిరుస్తున్న రిల‌య‌న్స్ జియోకు వ్య‌తిరేకంగా భార‌తీ ఎయిర్‌టెల్, టెలికాం ట్రిబ్యున‌ల్‌(TDSAT) ను ఆశ్ర‌యించింది. వెల్‌క‌మ్ ఆఫ‌ర్ ముగిసిన త‌ర్వా త కూడా ఉచిత ఆఫ‌ర్ కొన‌సాగింపునకు ఎలా అనుమ‌తి ఇచ్చారంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌)ను నిల‌దీసింది. ఈ మేర‌కు టెలికం వివాదాల ప‌రిష్కార ట్రిబ్యున‌ల్‌ను ఆశ్ర‌యించింది. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న రిల‌య‌న్స్ జియోకు ట్రాయ్ వంత‌పాడుతోంద‌ని ఆరోపించింది.

వాళ్లు చేసే చ‌ర్య‌ల‌ను చూస్తూ ట్రాయ్ ప్రేక్ష‌క పాత్ర పోషిస్తోంద‌ని విమ‌ర్శించింది. జియో ఉచిత వాయిస్‌, డేటా సేవ‌ల‌ను ఇక ముందు కొన‌సాగించ‌కుండా ఆదేశాలు జారీ చేయాల‌ని ట్రిబ్యున‌ల్‌ను కోరింది. ట్రాయ్ ఆదేశాల ఉల్లంఘ‌న కార‌ణంగా తాము ప్ర‌తి రోజు న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని ఎయిర్‌టెల్ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఉచిత కాల్స్ వ‌ల్ల పెరిగిన ట్రాఫిక్‌తో త‌మ నెట్‌వ‌ర్క్ దెబ్బ‌తింటోంద‌ని, అందుకే ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించింది.

ఇంతకు ముందు ఇదే రీతిలో వోడాఫోన్ కూడా జియో వ్యవహారంలో ట్రాయ్ పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, 1050 కోట్ల పెనాల్టీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వెల్ కమ్ ఆఫర్ ను మార్చి వరకు పొడిగించటంపై ఇప్పటికే పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి కూడా. అయితే వాళ్లిచ్చిన ఫ్లాన్ ను సరిగ్గా అమలు చేయకపోతే(ఫ్రీ కాలింగ్, డేటా ఫ్లాన్) మాత్రమే తమ వద్దకు రావాలంటూ ఇది వరకే ట్రిబ్యునల్ తెలిపి తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharti Airtel  TRAI  Reliance Jio  TDSAT  March Welcome Offer  

Other Articles