రెడ్డి-రావు ఫోన్ కాల్ తోనే బుక్కయ్యారు.. అందులో ఏముంది? | Phone call got Ram Mohana Rao trap into IT problems.

Phone conversation between shekar reddy and rammohan rao

IT trap Rammohan rao phone, shekar reddy and rammohan rao, Phone Call shekar reddy, Phone conversation shekar reddy rammohan rao, rammohan rao shekar reddy call, Jayalalitha's death day IT officials, Rammohan rao and Shekar reddy links, AP leaders in Tamil Nadu black money scam, IT raids Tamil Nadu, Ram Mohan Rao phone call, Shekar Reddy Phone call

Tamil Nadu former CS Rammohan rao and Shekar reddy conversations over hundred crores on Jayalalitha's death day.

జయ చనిపోయిన రోజు ఫోన్ ట్రాప్ చేశారా?

Posted: 12/23/2016 10:31 AM IST
Phone conversation between shekar reddy and rammohan rao

తమిళనాట నల్లధన నోట్ల కట్ల పాముల విషం(షయం) మొత్తంగా బయటకు వస్తోంది. ఇంత పెద్ద కుంభకోణం అసలు ఎలా వెలుగు చూసిందన్న దానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే సరిగ్గా అమ్మ చనిపోయిన రోజే ఈ అవినీతి తేనెతుట్టేను అధికారులు కదిలించినట్లు ఇప్పుడు తెలుస్తోంది. ‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత పెద్ద నోట్ల‌ను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్న‌వారిపై నిఘా పెట్టిన ఆదాయ‌పు ప‌న్నుశాఖ అధికారులు ఈ క్రమంలోనే శేఖ‌ర్‌రెడ్డి టెలిఫోన్ సంభాష‌ణ‌ల‌ను ట్రాప్ చేయ‌డంతో నోట్ల కుట్ర బ‌య‌ట‌ప‌డింది.

ఆరోజున రామ్మోహ‌న్‌రావు, చెన్నై కాంట్రాక్ట‌ర్ శేఖ‌ర్‌రెడ్డి మ‌ధ్య కొత్త నోట్లు భ‌ద్ర‌ప‌ర‌చ‌డంపై టెలిఫోన్‌లో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. అప్పటికే కొన్ని కోట్లను మార్చేసుకున్న వాళ్లు అ డబ్బంతా ఎలా భద్రపరుచుకోవాలన్న దానిపై అందులో చర్చించారంట. అదంతా అధికారులు రికార్డు చేశారు కూడా. వెంటనే అప్రమత్తం అయ్యి ముందుగా మెరుపువేగంతో శేఖ‌ర్‌రెడ్డి ఇళ్లు, కార్యాల‌యాల‌పై దాడులు చేసిన ఐటీ అధికారులు, ఆపై అత‌డిచ్చిన స‌మాచారంతో సీఎస్ రామ్మోహ‌న్‌రావు, అత‌డి కుటుంబ స‌భ్యుల ఇళ్ల‌పైనా దాడులు చేశారు.

సుమారు రెండు వారాల క్రితమే ఐటీ అధికారులు దాడులకు సిద్ధమైనా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంలో జాప్యమైంది. ఈ జాప్యం వల్ల రామ్మోహన్‌రావుకు విషయం లీకయింది. దీంతో ఆయన జాగ్రత్త పడ్డట్లు సమాచారం. రెండు వారాల క్రితమే దాడులు జరిపి ఉంటే రామ్మోహన్‌రావు, బంధువుల ఇళ్ల నుంచి భారీగా ఆస్తులు, నగదు పట్టుబడి ఉండేవని అంటున్నారు. ఈ విషయాలను ఓ అధికారి తెలిపారంటూ పేర్కొంటూ ఓ త‌మిళ ప‌త్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది.

ఎంత దొరికిందంటే...

మ‌రోవైపు రామ్మోహ‌న‌రావు, అత‌డి కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు నిర్వ‌హించిన త‌నిఖీలు గురువారం ముగిశాయి. రెండు రోజుల పాటు జ‌రిగిన త‌నిఖీల్లో మొత్తం 15 కేజీల బంగారం, రూ.24 ల‌క్ష‌ల నగ‌దు, కీల‌క స‌మాచారం ఉన్న ల్యాప్‌టాప్‌, 3 హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహ‌న‌రావు కార్యాల‌యం నుంచి 40 ఫైళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం త‌నిఖీల్లో రూ.100 కోట్ల‌కుపైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన ప‌త్రాల‌ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రామ్మోహ‌న్‌రావు కుమారుడు వివేక్ నివాసం, కార్యాల‌యం, ఆయ‌న న్యాయ‌వాది ఇళ్ల‌లోనూ అధికారులు సోదాలు నిర్వ‌హించి ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులతోపాటు ఏపీకి చెందిన కొందరు బడా బాబులతో శేఖర్‌రెడ్డి, రావులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నామని ఆయన అన్నారు. దాడుల్లో పట్టుబడిన సొమ్ములో ఈ ఆరుగురు మంత్రులకు వాటా ఉన్నట్లు తెలుసుకున్నామని చెప్పారు. కొందరు పారిశ్రామికవేత్తలు సైతం వీరి మనుషులుగా తేలిందన్నారు. ఇప్పటికే రామ్మోహన్‌రావుపై సస్పెన్షన్‌ వేటు పడింది. అతన్ని వేకెన్సీ రిజర్వు(వీఆర్‌)కు పంపింది ప్రభుత్వం. ఏక్షణంలోనైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  IT raids  former CS Rammohan rao  Chennai sand Taicun Shekar reddy  

Other Articles