ఇంట్లో కూర్చొని రూ. 2వేలు తెచ్చుకోవాలని వుందా..? Snapdeal to deliver cash at home

Snapdeal will deliver rs 2000 to your home under cash home

snapdeal, snapdeal cash to home delivery, get cash at home, rs 2000 notes, demonetisation, cash@home, snapdeal services, cash on delivery, snapdeal cash on delivery, technology, technology news, India news,Politics News, latest news

Snapdeal will now deliver cash up to Rs 2,000 to customers with its Cash@Home service

రూ. 2 వేలు హోం డెలివరీ కావాలా..?

Posted: 12/22/2016 08:56 PM IST
Snapdeal will deliver rs 2000 to your home under cash home

పెద్ద నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతకు దేశీయ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్డీల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది."Cash@Home" సర్వీసుల కింద ప్రజలకు కనీస అవసరార్థం నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు తెలిపింది. గురువారం నుంచి ఈ సర్వీసులను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ల అభ్యర్థన మేరకు ఈ సర్వీసుల కింద  గరిష్టంగా ఒక బుకింగ్కు రూ.2000 వరకు నగదును స్నాప్ డీల్ డెలివరీ చేయనుంది.

నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పీఓఎస్ మిషన్లో స్వైప్ చేసి స్నాప్డీల్కు ఈ నగదు చెల్లించవచ్చు. అయితే నామమాత్రపు రుసుము కింద రూ. 1ను కంపెనీ చార్జ్ చేయనుంది.  బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ ఫీజును డెబిట్ కార్డు ద్వారానైనా లేదా ఫ్రీఛార్జ్ ద్వారానైనా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
 
ఈ సర్వీసులతో గంటల కొద్దీ బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ఎలాంటి అవస్థలు పడకుండా సులభతరంగా నగదు అందేలా చేయనున్నామని కంపెనీ చెప్పింది. "Cash@Home" సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్డీల్ స్వీకరించదు. గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను కంపెనీ లైవ్గా ప్రారంభించింది. మిగతా మేజర్ నగరాల్లో ఈ సర్వీసులను కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snapdeal  cash  home delivery  rs 2000  demonetisation  cash@home  

Other Articles