నజీబ్ ను తప్పించారా? తప్పుకున్నాడా? | Delhi Lieutenant Governor Najeeb Jung resigned.

Najeeb jung resigns as delhi lieutenant governor

Delhi Lieutenant Governor Najeeb Jung, Najeeb Jung, Najeeb Jung Aravind Kejriwal, Najeeb Jung resign, Najeeb Jung news, Najeeb Jung Modi, Najeeb Jung Delhi, Najeeb Jung IAS, Najeeb Jung carrier, Najeeb Jung in Emergency, Najeeb Jung Kejriwal, Najeeb Jung, Najeeb Jung before tenure

Delhi Lieutenant Governor Najeeb Jung Submits Resignation To Centre. Najeeb Jung resigns as Delhi Lt Governor 18 months before his tenure.

షాక్: ఆ గవర్నర్ రాజీనామా చేసేశాడు!

Posted: 12/22/2016 04:45 PM IST
Najeeb jung resigns as delhi lieutenant governor

ఢిల్లీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నజీబ్ జంగ్ రాజీనామా చేసేశారు. కాసేపటి క్రితం తన రాజీనామా లేఖను ఆయన కేంద్రానికి పంపారు. ఈ సందర్భంగా తనకు సహకారాన్ని అందించిన ప్రధాన మంత్రికి కృతజ్నతలు తెలియజేశాడు నజీబ్.అంతేకాదు ఢిల్లీ ప్రజలు తనపై చూపిన ఆదరణకు ధన్యవాదాలు తెలియజేశాడు.

ఏడాది రాష్ట్రపతి పాలనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించిన అధికారులను అభినందిస్తూ ఓ లేఖ విడుదల చేశాడు. మరోవైపు ముఖ్యమంత్రిగా తనతోపాటు ప్రయాణించిన అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ధాంక్స్ తెలియజేశాడు జంగ్.

2013 జులైలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రభుత్వానికి, ముఖ్యంగా కేజ్రీవాల్ తో ఆయన వైరం తెలిసిందే. ఒకానోక తరుణంలో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి పరిస్థితి చేరింది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం అనుకూల వ్యాఖ్యలు చేశాడు. ఇంతలోనే 18 నెలల ముందుగానే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించటం విశేషం.

దీని వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ, కేంద్రం రాజీనామా పై తీసుకునే నిర్ణయం బట్టి అది తేటతెల్లమౌతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐఏఎస్ అధికారి అయిన నజీబ్ జంగ్ గతంలో విద్యా రంగంలో సేవలు అందించారు. రాజీనామా నేఫథ్యంలో ఆయన మళ్లీ అదే రంగంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi Lieutenant Governor  Najeeb Jung resign  

Other Articles