5000 డిపాజిట్ నిబంధన ఎత్తేశారు | Central U turn on Rs 5000 in old notes deposit.

Rbi withdraws rs 5000 deposit limit

restrictions Rs 5000, RBI 5000 notes limit, 5000 in old notes deposit, RBI withdraw 5000 limit, Central U turn on Rs 5000, RBI old notes, Rs 5000 deposit limit

The restrictions imposed on bank deposits exceeding Rs 5000 in old notes have now been withdrawn by RBI.

పాత నోట్ల డిపాజిట్లపై మరో ప్రకటన

Posted: 12/21/2016 02:07 PM IST
Rbi withdraws rs 5000 deposit limit

తీవ్ర నిరసనలు వ్యక్తం కావటంతో దెబ్బకి కేంద్రం దిగివచ్చింది. అక్ర‌మ డిపాజిట్‌ల‌ను నిరోధించేందుకు ఈనెల 19న రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు డిపాజిట్‌ల‌పై ఆంక్షలు విధించిన విష‌యం తెలిసిందే. దాని ప్రకారం డిసెంబర్‌ 19 నుంచి 30 వరకూ ఖాతాదారులు త‌మ‌ వ్యక్తిగత ఖాతాల్లో రద్దైన నోట్లను రూ. 5 వేలకు మించి ఒక్కసారి మాత్రమే జమ చేసుకోవాలని, అంతేగాక‌, రూ. 5 వేలకు మించి జ‌మ‌ చేస్తున్న సమయంలో ఆలస్యానికి కారణాలు కూడా వెల్లడించాలని రెండు రోజుల క్రితం పేర్కొంది.

అయితే, దీనిపై పెద్ద ఎత్తున్న నిరసనలు రావటంతో వెనక్కి తీసుకుంది. గడువు తక్కువగా ఉండటంతో తమ పరిస్థితి ఏంటని పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో మళ్లీ సమీక్ష జరిపిన ఆర్థిక శాఖ ఈ రోజు ఈ నిబంధ‌న‌ల‌న్నింటినీ ఉప‌సంహ‌రించుకుంది.

డిసెంబ‌రు 19 నాటి స‌ర్క్యుల‌ర్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 5 వేల పైన చేసే డిపాజిట్ల‌పై కొత్తగా విధించిన నిబంధ‌న‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపింది. ఖాతాదారులు ఎటువంటి వివ‌రాలు తెల‌పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఐదు వేల‌కు మించి న‌గ‌దును ఎన్ని సార్లైనా డిపాజిట్ చేసుకోవ‌చ్చని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 5000 deposit limit  RBI withdrawn restrictions  

Other Articles