ఏటీఎంతో ఎంతైనా డ్రా చేసుకోవచ్చా? | No limit on ATM withdrawals.

Atm withdrawal limit lifts soon

No limit on ATM, ATM withdrawals, ATM withdrawals limit, ATM withdrawals, ATM withdrawals after December 30, MoS Finance ATM withdrawals, withdrawals limit, ATM withdrawals, withdrawals old rules, no currency withdrawals, Finance Secretary Ashok Lavasa withdrawal

MoS Finance says No limit on ATM withdrawals after December 30.

ఏటీఎం నుంచి ఎంతైనా డ్రా చేసుకోవచ్చంట...

Posted: 12/21/2016 11:54 AM IST
Atm withdrawal limit lifts soon

42 రోజులు గడుస్తున్నా బ్యాంకులు, ఏటీఎం ల వద్ద ప్రజల పడిగాపుల వ్యధలు మాత్రం తీరటం లేదు. పూర్తి స్థాయిలో నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవటం, 90 శాతం ఏటీఎంలు ఇంకా మూసేసి ఉండటం, వచ్చిన నోట్లు వచ్చినట్లే జనాల మధ్య రోటేట్ కావటం, బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు తక్కువై పోవటం ఇలా కారణాలేవైనా ఇబ్బందులు మాత్రం ప్రజలే ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే త్వరలో ఈ కష్టాలు కాస్త తీరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఏటీఎంల నుంచి కేవలం 2500 రూపాయలను మాత్రమే విత్‌డ్రా చేయడానికి నిబంధన ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ పరిమితిని ఎత్తేయనున్నట్లు ఆర్థిక శాఖ ఓ ప్రకటన చేసింది. ఆర్థిక మంత్రి(మినిస్టర్ ఆఫ్ స్టేట్) సంతోష్ గంగ్వార్ దీనిపై ఓ ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను డిసెంబర్ 30వ తేదీ తర్వాత నుంచి ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 30 తర్వాత కొత్త నోట్లతోసహా చెలామణి అయ్యే ప్రజలందరికీ అందుబాటులో ఉంచుతాం. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఒకసారి రూ. 2500 మాత్రమే తీసుకోడానికి వీలున్న విషయం తెలిసిందే. అలా కాకుండా, మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉందని వివరించిన ఆయన ఈ కష్టాలు తాత్కాలికమైనవే అని, త్వరలో వీటిని సడలిస్తామని తెలిపాడు.

ఇంతకు ముందు ఆర్థిక కార్యదర్శి అశోఖ్ చవాసా కూడా డిసెంబర్ 16న త్వరలో విత్ డ్రా పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. ఇక ఒక్క ఏటీఎంల నుంచే కాదు, ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి రూ. 24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉండగా. డిసెంబర్ 30 తర్వాత దానిపై కూడా మార్పులు చేయబోతున్నారన్న స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No limit  ATM withdrawals  After 30th December  

Other Articles