ఆమె తలుచుకుంటే 5నే సీఎం అయ్యేదా? | Navaneetha krishnan Comments on Sasikala.

Aiadmk mp comments on sasikala

AIADMK MP Navaneetha krishnan, Sasikala CM, AIADMK Chief Navaneetha krishnan, AIADMK MP comments on Sasikala, Sasikala Natarajan TamilNadu CM, Sasikala natarajan Paneer Selvam, Navaneetha krishnan Sasikala Natarajan

AIADMK MP Navaneetha krishnan Comments on Sasikala Natarajan i.e. she will becomes CM soon.

శశికళపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Posted: 12/21/2016 09:46 AM IST
Aiadmk mp comments on sasikala

జయలలిత మరణం తర్వాత పార్టీని గుప్పిట్లో పెట్టేసుకున్న ఆమె నెచ్చెలి శశికళ ప్రస్తుతం రాజకీయాలను మలుపు తిప్పే పనిలో ఉన్నారు. ఇప్పటికే పైకి గంభీరాలు పలుకుతున్న సీఎం పన్నీర్ సెల్వం సహా కీలక మంత్రులంతా పోయిస్ గార్డెన్ కు క్యూ కడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె ముఖ్యమంత్రి పదవిని కూడా అధిష్టించబోతున్నారన్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేస్తుంది ఎశరో కాదు అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ నవనీత కృష్ణన్. తమిళ వెబ్‌పోర్టల్ ఒకటి నవనీత కృష్ణన్‌తో నిర్వహించిన ముఖాముఖిలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. శశికళ కోసం ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం పదవిని వదులుకుంటారా? అన్న వెబ్‌ పోర్టల్ ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘‘చిన్నమ్మ తలచుకుంటే ఈ నెల 5నే ముఖ్యమంత్రి అయ్యేవారు. ఆమెను ఎవరూ ప్రశ్నించలేరు. అయినా అతిత్వరలో చిన్నమ్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు’’ అని కృష్ణన్ పేర్కొన్నాడు.

శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కొందరు మంత్రులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మరో వైపు అమ్మ చూపిన మార్గంలో పార్టీ నడవాలంటే మాత్రం అనుచరుడు పన్నీర్ సెల్వం నాయకత్వంలోనే పార్టీ ముందుకు నడవాలని ఇంకొందరు వ్యాఖ్యనిస్తుంటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Natarajan  AIADMK MP Navaneetha krishnan  TamilNadu Chief Minister  

Other Articles