40 రోజులు గడిచింది.. ఇక మిగిలింది పది రోజులే.. ప్రభుత్వ నేతలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నా.. పరిస్థితులలో మాత్రం మార్పు కనబడటం లేదు. ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన 50 రోజులు ముగిసినా.. పరిస్థితుల్లో మార్పు వస్తుందన్న ఆశలు ఎక్కడ కనిపించడం లేదు. ప్రజలు డబ్బు.. డబ్బు అంటూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కేంద్ర నిర్ణయం మంచిదే కావొచ్చు.. కానీ దానిని అమలు చేస్తున్న విధానం, ముందస్తు ప్రణాళిక, చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమైందన్న వాదనలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్నాయి.
కేంద్రప్రభుత్వం వెల్లడించినట్లు తప్పకుండా బ్యాంకులు 24 వేల రూపాయలను వినియోగదారులకు అందించాలని, అ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు దేశసర్వోన్నత న్యాయస్థానం అదేశించింది. అయినా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైన నిర్ణయమని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మరోమారు పునరుద్ఘాటించారు. నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని ఆయన అన్నారు. కరెన్సీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా ముఖ్యమైన ప్రారంభమని పేర్కొన్నారు. దీన్ని అమలుచేయడానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలన్నారు.
ఫిక్కీ 89వ వార్షిక సాధారణ సమావేశంలో జై్టీ ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే... భారత్ ఆర్థిక వ్యవస్థ నూతన మార్పులతో దూసుకెళ్తోందని జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందన్నారు. మార్కెట్లోకి తిరిగి సరిపడ నగదును తీసుకురావడానికి ఎంతో సమయం పట్టదని భరోసా ఇచ్చారు. సమీప కాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నా, దీర్ఘకాలంగా నోట్ల రద్దు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. గత 5 వారాల్లో నగదు లావాదేవీలకు అనుబంధంగా డిజిటల్ కరెన్సీ జరిగిందని, ప్రస్తుతం దేశంలో 75 కోట్ల కార్డులు మార్కెట్లో ఉన్నాయని చెప్పారు.
ప్రపంచ ఆర్థికవ్యవస్థ పడిపోతుంది. ఈ సమయంలో దేశాలు తమకు తాముగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పెరుగుతున్న వస్తు రక్షణ విధానంతో ప్రపంచ ఎకానమీలో అనిశ్చితత ఏర్పడింది. బ్రెగ్జిట్ ఓటింగ్ కూడా ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వర్థమాన దేశాలన్నింటిలో చూస్తే భారత్ చాలా మెరుగ్గా ఉందన్నారు. 2017 సెప్టెంబర్ 16 నుంచి ప్రస్తుతమున్న పన్నులకు సంబంధించి చాలా తెరలు కనుమరుగవుతాయన్నారు. రాజ్యాంగ సవరణను చేయడానికి జీఎస్టీ కౌన్సిల్ చాలా నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. తుది ఆమోదం చెందడానికి ఎలాంటి మేజర్ సమస్యలు ఉంటాయని తాను భావించడం లేదన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more