గ్యాంగ్ రేప్ డ్రామా ఆడబోతే.. చివరకు | Noida student files fake gangrape case

Girl files fake rape case to trick parents

Noida Student, Fake Gang Rape Case, Girl fake Rape, Girl Gang rape drama, Student fake rape, Fake Rape Drama, India Fake Drama, Fake Indian Student Drama, Delhi Gang Rape Drama, Miss Exam Rape Drama, Parents Daughter Fake Rape Drama, Fake Gang Rape Case

Noida Student Files Fake Gang Rape Case After Missing University Exam.

గ్యాంగ్ రేప్ మూలంగా ఎగ్జామ్ రాయలేకపోయింది

Posted: 12/15/2016 08:26 AM IST
Girl files fake rape case to trick parents

మహిళల భద్రతకు దేశ రాజధాని ఏ మాత్రం సేఫ్ కాదన్న వార్తలు నిత్యం మనకు తారసపడుతున్నాయి. అయితే ఇదే అదనుగా భావిస్తున్న కొందరు తమ చిన్న చిన్న సమస్యలను తప్పించుకునేందుకు దీన్నో ఆయుధంగా వాడేసుకుంటున్నారు. నోయిడాలోని ఓ యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులకు భయపడి ఏం చేసిందో చూడండి.

ఆ యువతి తన పరీక్షకు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆమెను అధికారులు పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఎలా సమాధానం చెప్పాలో తెలియని యువతి, తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని, అందుకే తాను పరీక్షా సమయానికి వెళ్లలేకపోయానని పేరెంట్స్ తో తెలిపింది. దీంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు సఫ్దర్ జంగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఆమెను వివరాలు అడగగా, నలుగురు గుర్తుతెలియని ఆగంతుకులు కారులో వచ్చి తనను అడ్డుకుని గన్ పాయింట్ వద్దనున్న మహామాయ ఫ్లైఓవర్ వద్దకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని తెలిపింది.

ఆ పరిసరాల్లో సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులకు అలాంటి ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఫ్లైఓవర్ పరిసరాల్లో సీసీటీవీల్లో కూడా ఎలాంటి పుటేజ్ లభ్యం కాలేదు. దీంతో మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఆమెపై గ్యాంగ్ రేప్ జరగలేదని, పరీక్ష రాయలేదంటే తల్లిదండ్రులేమంటారోనన్న భయంతోనే అలా చెప్పిందని గుర్తించారు. దీంతో ఆమెను మందలించి వదిలేశారు. ఇంతకు ముందు గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ టెక్కీ కూడా బాయ్ ఫ్రెండ్ తో గడిపి, ఆపై తనను రేప్ చేశాడంటూ గగ్గోలు పెట్టి, విచారణలో దొరికిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  Noida Girl Fake Drama  Miss Exam  

Other Articles