థియేటర్లో జనగణమన.. సెల్ఫీలు తీసుకుంటున్న అమ్మాయలను ఏం చేశారు? | Youth attacked by mob for insulting Jana Gana Mana.

Three beaten in chennai for insulting jana gana mana

National Anthem, Chennai Theater, Three Youths Attacked, girls beaten by Mob, Fight in Theater, Youth attacked for disrespecting National Anthem, Jana Gana Mana Theater Attack, Girls beat Jana Gana Mana, Chennai Sivakasi Theater, Selfies in Theater, Selfies with Jana Gana Mana, Jana Gana Mana Cinema Hall

Three beaten up in Chennai Theater allegedly Insulting National Anthem.

థియేటర్లో అమ్మాయిలను చితకబాదేశారు

Posted: 12/12/2016 12:56 PM IST
Three beaten in chennai for insulting jana gana mana

సినిమా హాల్లో జనగణమన తప్పనిసరి అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయటం తెలిసిందే. అయితే ఆ సమయంలో నిలుచోకపోతే పరిస్థితి ఏంటని, తద్వారా జాతీయ గేయాలన్ని అవమానించినట్లే అవుతుంది కదా అని పలువురు తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో ఇప్పడు జాతీయ జెండా, గేయం రెండూ ప్రతిధ్వనిస్తున్నాయి.

ఈ క్రమంలో చెన్నైలో చోటు చేసుకున్న ఓ ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం ఓ థియేటర్ లో జాతీయ గేయం వస్తున్న సమయంలో నిలుచోలేదని చెప్పి ఓ యువకుడిని, అతని కూడా ఉన్న ఇద్దరు అమ్మాయిలను చితకబాదారు తోటి ప్రేక్షకులు. అశోక్ నగర్ లోని కాశీ థియేటర్ లో ‘చెన్నై 28-2(చెన్నై 600028.. /తెలుగులో కొడితే కొట్టాలిరా/ సీక్వెల్)’ అనే సినిమా ఆడుతోంది. దీనికి విజయ్ అనే రివ్యూ రిపోర్టర్ తన ఫ్రెండ్స్ అయిన షీలా, షబరితతో వచ్చాడు.

అయితే ఇంటర్వెల్ సమయానికి ఓ 20 మంది గుంపుగా చేరి విజయ్ తోపాటు, ఆ ఇద్దరు అమ్మాయిలను కొట్టడం ప్రారంభించారు. జాతీయ గేయం సమయంలో వారు నిలుచోలేదన్నది ఆరోపణ. చివరకు థియేటర్ యాజమాన్యం కలగజేసుకోవటంతో పరిస్థితి సర్దుమణిగింది.

దీనిపై విజయ్ వాదన ఇంకోలా ఉంది. తామేం జాతీయ గీతాన్ని అవమానించలేదని చెబుతున్నాడు. అంతేకాదు తమతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ షీలా చెప్పసాగింది. అయితే వారంతా జనగణమన వస్తున్న సమయంలో సెల్ఫీలు దిగుతూ గోల చేశారని, అందుకే వారికి బుద్ధిచెప్పామని విజయ్ కుమార్ అనే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి చెప్పటం కొసమెరుపు.

Cinemahall Jana Gana Mana

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai Theater  Youth Attacked by Mob  Selfies while Jana Gana Mana  

Other Articles