ఫ్లాసిక్ట్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. | Plastic currency notes to be printed soon.

Government decides to print plastic currency note

Plastic currency notes, Plastic notes India, Plastic 10 rupees notes, Plastic Notes, Plastic Currency in India, Plastic currency in parliament

Central Government decides to launch Plastic currency notes.

ప్లాస్టిక్ నోట్లతో సమస్యలు ఉండవా?

Posted: 12/09/2016 07:05 PM IST
Government decides to print plastic currency note

నోట్ల రద్దు నిర్ణయంపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, కేంద్రం మాత్రం ఆ అంశంలో వెనకడుగు వేయటం లేదు. న‌ల్ల‌ధ‌నాన్ని, న‌కిలీ నోట్ల‌ను అరికట్టే క్ర‌మంలో తన పంతాన్ని నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక నకిలీ నోట్ల నియంత్రణకు ప్లాస్టిక్ నోట్ల ప్రతిపాదనను త్వరలో అమలు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

నోట్ల నాణ్యతను మరింతగా బలోపేతం చేయడానికి తాము ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి అర్జున్ రాం మేగ్వాల్(MoS) పేర్కొన్నాడు. నిజానికి గత ఫిబ్రవరిలోనే పది రూపాయల ప్లాస్టిక్ నోట్లన ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనిపై విపక్ష నేతలు వివరణ కోరాగా, ఆయన లికిత పూర్వక సమాధానం ఇచ్చాడు. తప్పులు దొర్లకుండా ప్లాస్టిక్ నోట్ల ముద్రణ పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

ఒక బిలియన్‌ 10 రూపాయల ప్లాస్టిక్‌ నోట్లను కొచ్చి, మైసూరు, జయపుర, షిమ్లా, భువనేశ్వర్‌ నగరాల్లో మొద‌ట ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌భుత్వం తెలిపింది. ఈ నోట్ల‌ సగటు జీవితకాలం కేవ‌లం ఐదు ఏళ్లు మాత్రమే. ఈ నోట్ల‌కు నకిలీ నోట్లను ముద్రించ‌డం ఎవ‌రిత‌రం కాదు. ప్ర‌స్తుతం ఉన్న‌ పేపర్‌ కరెన్సీ కంటే ఈ నోట్లు శుభ్రంగా కూడా ఉంటాయి. త‌మ దేశంలో నకిలీ నోట్లను అరికట్టడానికి ఆస్ట్రేలియా ఇప్ప‌టికే ప్లాస్టిక్‌ నోట్లను ప్ర‌వేశపెట్టింది. ముందు చిన్న నోట్లను ఒక్కోక్కటిగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతూ ఆపై పెద్ద నోట్ల ముద్రణకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తోందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Plastic Currency  10 rupees notes  

Other Articles