ఓటుకు నోటు మళ్లీ అడ్డుపడిన హైకోర్టు | High Court relief to Chandrababu again in Cash for Vote.

Hc rejects probe against babu in cash for vote case

AP CM Chandrababu Naidu, Cash for Vote case 2015, Cash for Vote case CBN, High Court Chandrababu Naidu, Chandrababu Quash Petition, High Court rejects probe, ACB Court Chandrababu Naidu, ACB Chandrababu Naidu, Telangana ACB Cash for Vote, Chandrababu Alla Ramakrishna Undavalli, YSRC MLA Alla Ramakrishna Reddy, Undavalli Alla Chandrababu

High Court rejects probe against Chandrababu in Cash for Vote case.

ఓటుకు నోటు: ఆర్కే, ఉండవల్లికి షాక్

Posted: 12/09/2016 12:56 PM IST
Hc rejects probe against babu in cash for vote case

ఓటుకు నోటు కేసులో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తుతో తాము ఏకీభవిస్తున్నామని తెలిపిన బెంచ్, చంద్రబాబుపై విచారణ చేయాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్ ను కొట్టివేసింది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబును విచారించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను తోసిపుచ్చింది.

సుప్రీంకు వెళ్తారా?

తనపై నమోదయ్యే కేసులు విచారణకు రాకుండా చేసుకుని తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటేనని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ ఉదయం హైకోర్టులో ఆయనపై ఓటుకు నోటు విచారణ అక్కర్లేదని తీర్పు వచ్చిన తరువాత, ఆళ్ల ప్రసంగిస్తూ, ఈ విషయమై మరోసారి తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు స్పష్టం చేశారు. గతంలో ఇటువంటి కేసులనే ఎదుర్కొన్న పీవీ, జయలలిత తదితరులు క్వాష్ పిటిషన్లను దాఖలు చేయలేదని గుర్తు చేస్తూ, చంద్రబాబు తప్పు చేయకుంటే క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు.

గతంలో పీవీ ఓటుకు నోటు కేసులో శిక్షను కూడా అనుభవించారని, ఇప్పుడు మాత్రం ఓట్లు కొంటే అవినీతి కిందకు రాదని బాబు తరఫు న్యాయవాది వాదించడం, దాన్ని హైకోర్టు సమర్థిస్తూ, తీర్పులో ఉటంకించడాన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు. రెండేళ్ల నాడు నమోదైన కేసులో ఇంతవరకూ విచారణ జరగలేదని ఆరోపిస్తూ.. ఈ విషయంలో సుప్రీం కలగజేసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. .

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM Chandrababu Naidu  Cash for Vote case  High Court Relief  

Other Articles