చంపాలని కాదు.. చిలిపి చేష్టలు చేయబోయారంట... | pilots play naughty game with Mamatha Banerjee.

Naughty pilots behind mamata banerjee flight row

West Bengal, CM Mamatha Benarjee, Naughty Pilots Mamata Banerjee Flight Row, Mamata Banerjee Flight Row, DGCA Mamatha Benarjee

Pilots Behind Mamata Banerjee Flight Row Played 'Naughty' For Early Landing.

దీదీ విషయంలో వాళ్లు ‘నాటీ’గా ప్రవర్తించారంట...

Posted: 12/09/2016 09:33 AM IST
Naughty pilots behind mamata banerjee flight row

నోట్ల రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలకు అడుగుడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ప్రయత్నంలో ఆమెపై హత్యాయత్నం కూడా జరుగుతోందని తృణమూల్ కార్యకర్తలు ఆరోపణలకు దిగటం తెలిసిందే. కోల్‌ కతా విమానాశ్రయంలో ఆలస్యంగా లాండవ్వడం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.

దీంతో మమత హత్యకు స్కెచ్ వేశారని, అందుకే విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ ఫిర్యాదు చేసినా, అధికారులు ల్యాండింగ్‌ కు అనుమతినివ్వలేందంటూ ఎంపీలు సైతం లోక్‌ సభలో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ విమానం ల్యాండింగ్‌ ‘ఆలస్యం’ వెనుక అసలు రహస్యాన్ని డీజీసీఏ వెల్లడించింది. నిజానికి ఇంధనం అయిపోయిందనడం అవాస్తవమని, సకాలంలో విమానాన్ని ల్యాండింగ్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయంతోనే పైలట్లు ‘నాటీ’గా (కొంటెగా) వ్యవహరించారని డీజీసీఏ తెలిపింది.

ల్యాండింగ్ కోరిన (ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్) మూడు విమానాల్లోనూ కావాల్సినంత ఇంధనం ఉంది. ఇన్ టైమ్ ల్యాండింగ్ పేరుతో మంచి పేరుతెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఫోన్ చేసి ఇంధనమైపోయిందని ఫిర్యాదు చేశారు. నిజాలు నిర్ధారణ కావడంతో ఆ సమయంలో విమానంలో విధులు నిర్వర్తిస్తున్న పైలట్లతో పాటు, సిబ్బందిని కూడా వారం రోజులపాటు సస్పెండ్ చేశామని పౌర విమానాయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DGCA  CM Mamatha Benarjee  Naughty Pilots  

Other Articles