పవన్ విగ్రహం మరీ ఇలాగనా?... పట్టించుకునే నాథుడే లేడా? | Pawan Kalyan statue no care by any one.

Pawan kalyan statue in news again

Tadepalligudem Pawan Statue, Janasena Chief Pawan kalyan's Statue, Pawan kalyan Statues, Tadepalligudem Janasena, Janasena Chief Statues, Pawan kalyan's Statue

Janasena Chief Pawan kalyan's Statue at Tadepalligudem ignored by Fans.

మరోసారి వార్తల్లోకి పవన్ విగ్రహాం

Posted: 12/07/2016 02:21 PM IST
Pawan kalyan statue in news again

జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ క్రేజ్ కా బాప్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాలతో అది మరింత పీక్స్ లోకి వెళ్లిపోగా, ఏపీలో ఏకంగా విగ్రహాలు పెట్టేస్థాయికి చేరిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఓ సెంటర్ లో ప్రతిష్టించిన సంగతి తెలిసిందే.

అయితే అలాంటివి ఇష్టం ఉండదని సున్నితంగా పవన్ చెప్పేయటం అభిమానులు ఆ విగ్రహాన్ని అలాగే వదిలేశారు. తమ అభిమాన హీరోకు నచ్చని పని చేయడమెందుకని... ముసుగుతో మూసేశారు. కానీ, తాజాగా ఆ విగ్రహానికి కప్పిన కవర్ కూడా చిరిగిపోయి సగం విగ్రహం బయటకు కనిపిస్తోంది.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొడుతోంది. దీంతో, ఆయన అభిమానులు కలవరపడుతున్నారు. విగ్రహం ప్రతిష్టకు నోచుకోకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. మరి, ఇప్పటికే శ్రీకాకుళంలో గుడి కట్టేపనిలో ఉన్న అభిమానులు.. ఈ విగ్రహం విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక్క తాడేపల్లిగూడెంలోనే కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా విగ్రహాలు ప్రతిష్టించాలన్న ఆలోచనలో ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena Chief  Pawan kalyan's Statue  Tadepalligudem  

Other Articles