అమ్మ మృతికి జనసేన ప్రగాఢ సంతాపం Pawan Kalyan's JanaSena Condolence to Jayalalithaa

Pawan kalyan s janasena condolence to jayalalithaa

pawan kalyan, pawan kalyan condolence, pawan kalyan press note, jana sena party, pawan Kalyan, janasena condolences, jayalalithaa demise, Pawan Kalyan, Jayalalithaa, Tamil Nadu, Janasena, pawan kalyan condolence to jayalalithaa, pawan kalyan about jayalalitha

Popular hero & politician Powerstar Pawan Kalyan expressed his grief towards the sad incident of Tamil Nadu’s late chief minister Jayalalithaa Jayamanaran’s death.

అమ్మ మృతికి జనసేన ప్రగాఢ సంతాపం

Posted: 12/06/2016 01:37 PM IST
Pawan kalyan s janasena condolence to jayalalithaa

విప్లవ నాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అనారోగ్యంతో అస్పత్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురాగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలతో పాటు తానూ ఆశించానని.. అయితే అమె తిరిగిరాని లోకాలకు పయనమై అందరినీ తీవ్రదు:ఖంలో వదిలి వెళ్లారని ఆయన అన్నారు.
 
మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారని అన్నారు. అమ్మ అనంతలోకాలకు వెళ్లడంతో తమిళ ప్రజలు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలు అనాధలయ్యారన్నారు. జయలలిత పేదల అభ్యున్నతి కోసమే అధికంగా శ్రమించారని, వారి ప్రగతే అశగా, శ్వాసగా జీవించారని.. అమె అములు పర్చిన సంక్షెమ పథకాలు సదా అనుసరణీయమని అయన అన్నారు.

‘అమ్మ’  మరణం తమిళనాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని అన్నారు. అమ్మ లోటును ఎవరూ భర్తీ చేయలేనిదన్నారు, మరీ ముఖ్యంగా మహిళా శక్తికి ప్రభల నిదర్శనంగా అమ్మ నిలిచారని పేర్కోన్నారు. మహిళా అభ్యున్నతిని నిరంతరం కాంక్షిస్తూ అమె ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆమెకు మన:పూర్వక అంజలి ఘటిస్తూ, పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  condolence  Jana sena  jayalalithaa  chennai  rajaji hall  Tamil Nadu  

Other Articles