రాష్ట్రపతి ప్రణబ్ విమానంలో సాంకేతిక లోపం.. technical snag in plane carring pesident pranab

Technical snag in plane carring pesident pranab

president, pranab mukherjee, jayalalithaa, army plane, President special plane, chennai, rajaji hall, technical snag, jayalalithaa demise

Army special aeroplane carring president pranab mukherjee developed a techniacal snag in mid air, and landed safely at delhi, who was on the way to chennai to pay tributes to tamilnadu cm jayalalithaa

రాష్ట్రపతి ప్రణబ్ విమానంలో సాంకేతిక లోపం..

Posted: 12/06/2016 12:00 PM IST
Technical snag in plane carring pesident pranab

భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గాలితో వుండగా ఈ లోపం తలెత్తిడంతో వెంటనే గుర్తించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు దానిని హుటాహుటిన ఢిల్లీకి తరలించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కడసారి నివాళులు అర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్మీకి చెందిన ప్రత్యేక విమానంలో చెన్నై బయల్దేరారు. రాజాజీ హాలులో వుంచిన అమ్మకు శ్రద్దాంజలి ఘటించేందకు వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
విమానం చెన్నైకి చేరుకుంటున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఫైలెట్ విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో దిగకుండానే ఆ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఇక జయలలితకు ప్రత్యక్షంగా నివాళులు అర్పించే వీలు ఉంటుందో లేదో అన్నది అనుమానంగానే మారిపో్యింది. కాగా, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అకాలమృతిపై తనను దు:ఖసాగరంలో ముంచిందన్నారు.

తనకు జయలలిత చాలా కాలం నుంచి తెలుసునని, తాను పార్లమెంటు పక్ష నేతగా వున్నప్పుడు అమె తొలిసారగా సభలోకి అడుగుపెట్టారని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. అమెతో తాను వివిధ సందర్భాలలో అనేక అంశాలపై చర్చించానని కూడా తెలిపారు. అమ్మ తనకు ఎదురైన అనేక వివాదాలను దీక్షా పటుట్దలతో ఎదర్కోని విజాయాన్ని సాధించారని అన్నారు. అమె తన జీవిత చరమాంకం వరకు అన్నింటినీలో పోరాడుతూనే వున్నారని అన్నారు. మరోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపాన్ని సమర్పించిన తరువాత పార్లమెంటు ఉభయ సభలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి.

కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరిగి చెన్నై బయలుదేరారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వెళ్లిన ఆయన.. మళ్లీ , చెన్నైకి పయనమయ్యారు. సాంకేతిక సమస్యను సరిదిద్దిన అనంతరం రాష్ట్రపతి.. అదే విమానంలో తిరిగి చెన్నైకి బయలుదేరారు. కాగా, ఆయన ఇవాళ చెన్నైలోని మెరినా బీచ్‌లో జరిగే తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : president  pranab mukherjee  jayalalithaa  army plane  chennai  rajaji hall  technical snag  

Other Articles