ఆ వికలాంగ చిన్నారి ఒలంపిక్స్ కల చెదిరిపోయింది | nine years old Special Olympics Swimmer Was Disqualified

Special olympics swimmer disqualified for being too fast

Rory Logan, Disabled Boy, Special Olympics swimmer Disqualified, For Swimming, Special Olympics Ireland, Special Olympics Ireland 2017, Northern Ireland swimmer, Disabled Swimmer Rory Logan, Bangor swimmer

Disabled Boy Was Disqualified For Swimming Too Fast In His Race.

ప్చ్... అతివేగంతో ఒలంపిక్స్ మిస్సయ్యాడు

Posted: 11/30/2016 10:34 AM IST
Special olympics swimmer disqualified for being too fast

స్విమింగ్ రేసులో అతను గెలిచాడు. అయినా అనర్హుడు అయ్యాడు. అలాగని మోసం చేయలేదు, అతివేగం చూపాడు అంతే...

రోరి లోగన్ అనే 9 ఏళ్ల బాలుడు అటిజంతో బాధపడుతున్నాడు. కానీ, మంచి స్విమ్మర్. అందుకే వచ్చే ఏడాది ఐర్లాండ్ లో జరబోయే ప్రత్యేక ఒలంపిక్స్(వికలాంగుల కోసం) కోసం అహర్నిశలు కష్టపడడ్డాడు. అందుకోసం ముందుగా క్వాలిఫైయింగ్ పోటీల్లో గెలవాల్సి ఉంది. బాంగోర్ లో నిర్వహించిన ఫైనల్ కి అర్హత సాధించాడు కూడా. కానీ, వేగం అతని పాలిట శాపంగా మారింది.

తొలి హీట్‌ లో 50 మీటర్ల దూరాన్ని కేవలం ఒక నిమిషం మూడు సెకండ్ల వ్యవధిలోనే గమ్యాన్ని చేరుకున్న రోరి లోగన్ ఫైనల్స్‌ లో స్థానం సంపాదించాడు. నిబంధనల ప్రకారం ఫైనల్స్‌ లో ప్రదర్శించిన సామర్థ్యంలో కేవలం 15 శాతం స్పీడుతో మాత్రమే స్విమ్మింగ్‌ చేయాలి. అయితే రోరి నిబంధనల ప్రకారమే ఈత కొట్టినా, అతని వేగం 15.8 శాతం ఉండడంతో అతనిని ఈ టోర్నీ నుంచి అనర్హుడిగా నిర్ణయించారు. దీంతో రోరీ ఒలంపిక్స్ లో పాల్గొనాలన్న కల చెదిరిపోయింది. జడ్జిల నిర్ణయం వెలువడగానే రోరీ అమాంతం తల్లి కౌగిల్లో చేరి గుక్కపట్టి ఏడవటం ప్రారంభించాడు.

'అమ్మా నేనే తప్పు చేయలేదమ్మా! అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరుకున్నా, నన్నెందుకు డిస్ క్వాలిఫై చేశారు?' అంటూ ప్రశ్నించడంతో ఆమె కూడా కన్నీరు కార్చింది. కుమారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్న తల్లి యాతనను చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rory Logan  Disabled Swimmer  Bangor  Disqualified  

Other Articles