యోగా గురు అక్రమాలపై స్పెషల్ స్టోరీలు | ramdev baba illegal activities in Nepal.

Yoga guru ramdev embroiled in investment row in nepal

Patanjali Ayurved group, Yoga guru Ramdev, Nepal, Patanjali in Nepal, Nepal baba ramdev, Ramdev Baba illegal activities, Ramdev Illegal activities, Khantipur daily, ramdev investments in Nepal, Upendra Mahato, Samata prasad atanjali

Yoga guru Ramdev and his Patanjali Ayurved group were embroiled in a controversy in Nepal on Monday after the media reported he had invested more than Rs 150 crore in the country without approval from government agencies.

రాందేవ్ ఇల్లీగల్ వ్యవహారాలపై మీడియా కథనం

Posted: 11/29/2016 08:04 AM IST
Yoga guru ramdev embroiled in investment row in nepal

యోగా గురువు రాందేవ్ బాబాపై సంచలన ఆరోపణలు వినిస్తున్నాయి. నేపాల్‌ లో అక్రమంగా పెట్టుబడులు పెట్టాడంటూ ఆ దేశ మీడియా ఒకటి సోమవారం కథనాలు ప్రసారం చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ పెట్టుబడులతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే పతాంజలి యోగపీఠాన్నినడుపుతున్నారంటూ ఆరోపించింది.

సుమారు 150 కోట్ల రూపాయలకుపైగా అక్రమ పెట్టుబడులు పెట్టినట్లు కంఠిపూర్ డైలీ అనే పత్రిక ఆరోపించింది. ఈ నిధులన్నీ విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ ట్రాన్స్‌ ఫర్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, పతంజలి యోగాపీఠ్ ట్రస్ట్ పేరు కూడా లాభేక్ష లేని సంస్థ అని చూపించి నేపాల్ చట్టాలను ఉల్లంఘించారని అందులో పేర్కొంది.

నేపాల్‌‌ ప్రముఖ వ్యాపారవేత్త ఉపేంద్ర మహతో, ఆయన భార్య సమతా ప్రసాద్ పేరుతో రిజిష్టర్ అయిన పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా అక్రమమేనని ఆరోపించింది. యోగాపీఠ్ ట్రస్ట్ పేరుతో పలు ప్రాజెక్టులు కూడా పతంజలి సంస్థ చేపట్టిందని నేపాల్ మీడియా తెలిపింది.

కాగా, నేపాల్ మీడియా ఆరోపణలను రాందేవ్ బాబా ఖండించారు. నేపాల్లో తాము ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. తాము పతంజలి యోగాపీఠ్ ద్వారా పెట్టుబడులు పెట్టాలనుకుంటే నేపాల్ ప్రభుత్వ అనుమతి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా అక్కడ ఎంతో మందికి ఉపాధి కల్పించామని, రానున్న పదేళ్లలో 10,000 కోట్లతో మరో 20,000 ఉపాధి కల్పిస్తామని తెలిపాడు.

ఆ దేశంలో ఉ గత వారం రాందేవ్ బాబా నేపాల్ లో యోగా వారోత్సవాన్ని నిర్వహించగా, దానికి ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని కూడా హాజరయ్యారు. దీంతో స్పెషల్ ఫోకస్ చేసిన మీడియా ఇలా రాందేవ్ పై కథనాలు ప్రచురిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Patanjali Ayurved group  Yoga guru Ramdev  Nepal  investments  illegal  

Other Articles