పవన్ ను తొక్కేసి మరీ ఆ ఛానెల్ సర్వేలో బాబు భజనా! | Pawan Ignore and Babu highlight in Flash Survey.

Abn flash team survey highlight chandra babu

Pawan Kalyan Janasena, ABN Andhrajyothi, Telugu Desam Party, Flash Survey, Chief Minister Chandra Babu Naidu,

ABN Andhrajyothi conducted flash survey on Andhra Pradesh Govt. channel indicates that Telugu Desam Party is way ahead of its political rivals while the Opposition YSRCP is losing ground. As of now, Jana Sena has not made any ground.

పవన్ ను పక్కన పడేసి మరీ బాబు హైలెట్

Posted: 11/28/2016 10:34 AM IST
Abn flash team survey highlight chandra babu

కాలచక్రం గిర్రున తిరిగేసింది. అప్పుడే తెలుగు రాష్ట్రాల అధికార పక్షాలకు రెండున్నరేళ్లు గడిచిపోయాయి. తెలంగాణలో పూర్తిగా గులాబీ బాస్ డామినేషన్ నడుస్తుండగా, ఏపీలో మాత్రం పరిస్థితి అంతుచిక్కకుండా ఉంది. ఓవైపు విభజన తర్వాత లోటు బడ్జెట్, ప్రత్యేక హోదా హ్యాండివ్వటం, ఆపై నిధుల విషయంలో కూడా అలసత్వం, ఇలా సమస్యలన్నీ ఒకదానిని మించి మరోకటి నవ్యాంధ్రను చుట్టుముట్టాయి. ఇలాంటి సమయంలో టీడీపీ పై ప్రభుత్వం ప్రజాభిప్రాయం ఏంటి? అన్న అంశంపై ఫ్లాష్ టీం పేరిట ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.

అయితే ఇప్పటికిప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే, 2014 ఎన్నికల కన్నా మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ఓ ప్రముఖ ఛానెల్ తన సర్వేలో వెల్లడించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అందులో వివరణ చూస్తే ఎవరికైనా సందేహాలు కలుగకమానవు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - బీజేపీ కలసి పోటీ చేస్తే 120 అసెంబ్లీ సీట్లు రాగా, ఒకవేళ ఇప్పుటికిప్పుడు బీజేపీతో కటీఫ్ చెప్పి, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్ల వరకూ వస్తాయని చెప్పడం విశేషం.

బీజేపీ నుంచి విడిపోతే మైనార్టీ ఓట్లన్నీ టీడీపీకే పడతాయని, ఆ లెక్కన విడిపోతే టీడీపీనే ఎక్కువ లాభపడుతుందని ఆ సర్వే సారాంశం. ప్రతిపక్ష వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గి, కాంగ్రెస్ కు కొంత ఊరట కలిగేలా ఓట్లు పడే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అది కూడా టీడీపీకే లబ్ధి చేకూరుస్తుందని వివరించింది. ముఖ్యంగా తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్న జనసేన పార్టీకి అనూహ్యంగా 4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదవుతుందని చెప్పటం కొసమెరుపు.

అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పార్టీల ప్రాబల్యం, ఇతరత్రా కీలక అంశాల పరిగణనలోకి తీసుకునే 23 నియోజకవర్గాల్లో సర్వే చేసినట్లు సదరు వార్తా సంస్థ ప్రకటించింది. అయితే ఇది వాస్తవాలకు చాలా దూరంగా ఉందని ఎద్దేవా చేసిన వైసీపీ తెలుగుదేశం పార్టీకి మరోసారి ఓటేసే ఆలోచనలో ప్రజలు లేరని అంటోంది. సొంత మీడియా సంస్థతో డబ్బాలు కొట్టించుకోవటం అధికారపక్షానికి ఎప్పటి నుంచో అలవాటు ఉన్నదే కదా అని కామెంట్లు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ABN Andhrajyothi  Flash Survey  TDP  Chandrababu Naidu  Pawan Kalyan  

Other Articles