బినామీలకు ముందుంది మొసళ్ల పండగ.. 'Less-cash' first, 'cashless society' next says PM Modi

Pm modi addresses the nation through mann ki baat on demonetisation

PM Modi, Narendra Modi, Mann ki baat, corruption, binami, demonetisation, cash withdrawals, demonetisation narendra modi, demonetisation, demonetisation, cash withdrawals, Rs 2000 notes, Rs 2000 notes terrorists, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban

PM Modi made the biggest public push for a 'cashless economy'. He said 'cashless' society is not immediately possible, and appealed to the people to work towards it.

బినామీలకు కూడా మున్ముందు ఉంటుందట మొసళ్ల పండగ..

Posted: 11/27/2016 04:18 PM IST
Pm modi addresses the nation through mann ki baat on demonetisation

పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ నిర్ణయంతో 50 రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని తాను ముందే చెప్పానన్నారు. మన్‌ కీ బాత్ లో మోదీ మాట్లాడుతూ అవినీతిని అంతం చేయడం అంత తేలికైన విషయం కాదని, కొన్ని చర్యలు తీసుకునే సమయంలో ఇబ్బందులు వస్తుంటాయని అన్నారు. పెద్ద నోట్ల నిర్ణయంతో ఖచ్చితంగా దేశానికి మంచి జరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతమంది వ్యక్తులు తమ వద్ద ఉన్న నల్ల డబ్బును మార్చుకునేందుకు పలు అడ్డదార్లు తొక్కుతున్నారని చెప్పారు. పేదలను అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జన్‌ ధన్‌ ఖాతాదార్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా ఇతరుల డబ్బును ఖాతాల్లో జమ చేసుకొని ఇబ్బందులపాలు కావొద్దని అన్నారు. త్వరలోనే బినామీల పనిపడతామని, కఠినమైన చట్టం తీసుకొస్తామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకు ఉద్యోగులు, పోస్టాపీసు ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రజల ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.

 ఇక నగదు రహిత లావాదేవీలకు ప్రజలు కలిసి రావాలని మోదీ కోరారు. సాంకేతిక పరిజ్ఞానం అందించే డిజిటల్‌ బ్యాంకింగ్‌ రంగానికి మారాలని, ఇందుకోసం ఈ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించుకోవాలని సూచించారు. చిరు వ్యాపారాలు మొదలుపెట్టేవారికి ఇదే సరైన సమయం అని మోదీ చెప్పారు. వారు కూడా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చని చెప్పారు. గతంలో పేదలు జన్‌ ధన్‌ రూపే కార్డులు ఉపయోగించేవారు కాదని, ఇప్పుడు వాటి వినియోగం 300శాతానికి పెరిగిందని తెలిపారు. నగదు రహిత ఆర్ధిక వ్యవస్థకు దేశం మొత్తం తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  Narendra Modi  Mann ki baat  corruption  binami  demonetisation  cash withdrawals  

Other Articles