భారత్ ధీటైన దెబ్బకు.. కాళ్ల బేరానికి దిగివచ్చిన పాక్ Pak Pleaded us to Stop 'Powerful Response' says Manohar Parrikar

Pak pleaded us to stop powerful response says manohar parrikar

Manohar Parrikar, India Pakistan ties, LoC firing, Militant attack, Indian Army, Soldier's mutilated body, Line of Control, soldiers killed, army men killed, army, indian army, jammu and kashmir, soldiers killed, jammu kashmir, kashmir, kashmir encounter, terrorist encounter, army, indian army, mutilated, india news

Indian armed forces were called by their Pakistani counterparts some days back, pleading that India should halt its response, Defence Minister Manohar Parrikar said.

భారత్ ధీటైన దెబ్బకు.. కాళ్ల బేరానికి దిగివచ్చిన పాక్

Posted: 11/26/2016 05:37 PM IST
Pak pleaded us to stop powerful response says manohar parrikar

భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న ధాయాది సైన్యం.. భారత్ అర్మీ ధీటైన ప్రతిదాడులకు తోకముడుచుకుని దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చింది.  సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టనబెట్టుకుని ఒక్క సైనికుడి మృతదేహాన్ని ముక్కలుగా నరికేసిన నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతీణభూనిన భారతసైన్యం మాటకు కట్టుబడింది. మరింత దీటుగా పాక్‌ సైన్యానికి జవాబునిచ్చింది. భారత బలగాల షెల్లింగ్‌ దాడుల్లో 11మంది పౌరులు, ముగ్గురు సైనికులు చనిపోయినట్టు పాక్‌ అధికారులు ప్రకటించారు.

అంతేకాకుండా పాక్‌ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరళ్లు హాట్‌లైన్‌లో చర్చించి.. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి  మనోహర్‌ పరీకర్‌ స్పందిస్తూ.. సరిహద్దుల్లో ‘పిరికిపంద’ దాడులను భారత్‌ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్‌ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌ను విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పరీకర్‌.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు.

‘మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి ‘దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు’ అని పరీకర్‌ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles