నోటు రద్దు ప్రభావాన్ని జైట్లీకి రుచి చూపించిన సతీమణి, Jaitley tasted demonetisation effect by his wife

Ministers feel the pinch of restrictions on cash withdrawals much like common man

demonetisation, cash withdrawals, cash withdraw limits, Arun Jaitley, BJP MPs, Finance Ministry, Rs 2000 notes, Rs 2000 notes terrorists, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban

BJP has asked some of its senior ministers to host groups of 50 MPs over dinner to explain the rationale behind the government's demonetisation move.

నోటు రద్దు ప్రభావాన్ని జైట్లీకి రుచి చూపించిన సంగీత..

Posted: 11/26/2016 01:33 PM IST
Ministers feel the pinch of restrictions on cash withdrawals much like common man

దేశం నుంచి అవినీతిని పారద్రోలేందుకు, నల్లధన అక్రమార్కుల అటకట్టించేందుకు, ఉగ్రవాద, అంతర్గత తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తందరపాటు చర్యని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఘమేఘాల మీద ఈ నిర్ణయాన్ని తీసుకుని రెండు సర్జికల్ స్ట్రైల్ లోనూ నరేంద్రమోడీ విఫలమయ్యారని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి.. నిలబడలేక అవస్థలు పడుతున్న ప్రజలు కేంద్రంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజలకు అవసరమైన సంఖ్యలో ముందుగా కొత్త నోట్లను ఇప్పుడు చేసినట్లే అత్యంత గోప్యంగా ముద్రించి.. ఆ తరువాత ఏటీయం కేంద్రాలు, బ్యాంకులకు వాటిని రవాణా చేసి.. ఆ తరువాత పెద్ద నోట్లను రద్దు చేసివుండాల్సిందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరికోందరు కనీసం ప్రజలకు అవసరమైన సంఖ్యలో వందనోట్లను ముద్రించి వాటిని ప్రజావసరాలకు సరిపడ సంఖ్యలో పంఫిణీ చేసిన తరువాత పెద్ద నోట్లను రద్దు చేసి వుంటే బాగుండేదని, కేంద్రం తొందరపాటు నిర్ణయంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోంటున్నామని ప్రజలు వాపోతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్రం ఏటీయం కేంద్రాలు, విత్ డ్రాలపై పరిమితులను విధిస్తూ ప్రజలను అనేక అవస్థలకు గురిచేస్తుందన్నది ప్రజాభిప్రాయం. పెళ్లిళ్లకు మినహాయింపులు కల్పించిన కేంద్రం, చావులు, సముర్తలు, దినాలు సంవత్సరికాలు, ఇలా అనేక శుభ, అశుభకార్యాలకు డబ్బులు అవసరమని, కేంద్రం విధించిన పరిమితులతో అవి సాధ్యంకాదన్నది నిజం. అయితే తమకు ఎదురుకానంత వరకు ఏదీ సమస్య కాదు. కానీ తాము అలాంటి పరిస్థితి ఎదురుకుంటేనే.. పరిస్థితి అవగతం అవుతుందన్నది వాస్తవం.

నోట్ల రద్దుకు, పరిమితుల విధింపుకు మూలకారణమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఇప్పడీ అనుభవం విషయం అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. అయన సతీమణి సంగీతా జైట్లీ పేదలు, మధ్యతరగలి ప్రజలు పడుతున్న భాధ ఏలా వుంటుందన్నది స్వయంగా కేంద్ర ఆర్థక మంత్రికే రుచిచూపించారు. అదెలా అంటారా..? పార్లమెంటు సమావేశాలలో విపక్షాలు సాగిస్తున్న అందోళన కార్యక్రమాలు, నిరసనలతో ఉభయ సభలు సజావుగా సాగడం లేదు. విపక్షాలను అడ్డుకుని మాట్లేందుకు బీజేపి సీనియర్ నేతలు మినహా ఎవరూ ముందుకురావడం లేదు.

దీంతో అసలు నోట్ల రద్దు, పరిమితుల విధింపు, కొత్త నోట్ల ముద్రణ అదితర అంశాలపై తమ ఎంపీలకు వివరించాలని నిర్ణయించారు ప్రధాని. మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు ఈ అంశంపై ఒక్కో మంత్రి 50 మందికి ఆతిథ్యం ఇచ్చి వారికి పూర్తి వివరాలు వెల్లడించాలని పేర్కొంది. తద్వారా ఆ ఎంపీలు తమతమ నియోజకవర్గాల ప్రజలకు అవే వివరాలను తెలిపి ప్రజల మద్దతు పొందుతారని భావించింది. పార్టీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. వెంటనే తమ ఇంటికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. అంతా శ్రద్ధగా విన్న ఆయన సతీమణి.. ‘‘మన ఇద్దరం బ్యాంకు ఖాతాల నుంచి వారానికి చెరో రూ.24 వేలు మాత్రమే తీయగలుగుతాం. ఆ సొమ్ము 50 మందికి ఆతిథ్యమివ్వడానికి సరిపోదు’’ అని చల్లగా చెప్పాగానే మంత్రివర్యులు ఖంగుతిన్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  cash withdrawals  Arun Jaitley  cash withdraw limits  BJP MPs  Finance Ministry  

Other Articles