ఏంజెల్ మోర్కెల్ ను జర్మనీలో అడుగుపెట్టనివ్వటం లేదు | Baby Angela Merkel family loses asylum bid.

Angela merkel refused asylum in germany

Angela Merkel, Syrian Baby, Syrian Angela Merkel, Angela Merkel Germany Asylum, Baby Merkel Asylum, Tema Al-Hamza, Mamon Al-Hamza

Family of baby named for Angela Merkel loses asylum bid.

ఏంజెల్ మోర్కెల్ ను జర్మనీలోకి రానివ్వరంట!

Posted: 11/26/2016 10:24 AM IST
Angela merkel refused asylum in germany

జర్మనీలో రాజకీయ సంక్షోభం లేదు. అయినా ఏంజెల్ మోర్కెల్ ను జర్మనీలోకి రానీవ్వటం లేదు. దశాబ్ధంపైగా ఏలుతున్న ఛాన్సలర్ ఏంజెల్ మోర్కెల్ ను సొంత దేశంలోకి అనుమతించకపోవటం ఏంటనుకుంటున్నారా? ఆ మోర్కెల్ ఈ మోర్కెల్ ఒకటి కాదులేండి. అసలు వ్యవహారం ఏంటో ఇది చదవండి తెలుస్తుంది.

గతేడాది సిరియాలోని దుయిస్ బర్గ్ లో వైమానిక దాడులు ముమ్మారంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో జర్మనీ భద్రతా దళాలు నొప్పులతో బాధపడుతున్న టెమ ఆల్ హంజా అనే ఓ మహిళను గుర్తించారు. వెంటనే తమ శిబిరంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వారి వైద్యులతో ప్రసవం చేయించారు. అంతే ఆ తల్లి జర్మీని వాసులకు జన్మంతా రుణపడి ఉంటానని కృతజ్నత చెప్పుకుంటూ ఆ పాపకి జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ పేరు పెట్టుకుంది.

ఏడాది గిర్రున తిరిగింది. సంక్షోభం కారణంగా సిరియా నుంచి జర్మనీకి వలసలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో మోర్కెల్(పసిపాప) కుటుంబంతో జర్మనీ వెళ్లాలని నిశ్చయించుకుంది. అందుకోసం ఆర్జీ కూడా పెట్టుకుంది. అయితే వారి ప్రతిపాదనను తిరస్కరించటంతోపాటు జర్మనీ ఫెడరల్ అధికారులు ఓ వార్నింగ్ లెటర్ కూడా పంపించారంట.

Baby Angela Merkel

ఆ లేఖ చదివాక నేను చాలా భయానికి గురయ్యానంటూ ఆ పాప తండ్రి మెమోన్ తెలిపాడు. తాము జర్మనీని సొంత భూమిలా ఫీలవుతున్నామని, ఇక్కడ భద్రత లేదు గనక దయ చేసి మాకు ఆశ్రయం కల్పించాలని కోరుతున్నాడు.

కాగా, 1951 యూనైటెట్ స్టేట్స్ శరణార్థుల చట్టం ప్రకారం సిరియా వాసులు నిరభ్యరంతంగా జర్మనీకి వలస వెళ్లొచ్చని, అందుకు అధికారుల ధృవీకరణ ఉంటే సరిపోతుందని పేర్కొంది. 2015లో సుమారు లక్షపైగానే సిరియా ప్రజలు జర్మనీకి వెళ్లారు కూడా. ఇంకోవైపు జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మోర్కెల్ కూడా ఈ విషయంలో సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నప్పటికీ, ఫెడరల్ అధికారులు మాత్రం శాంతి భద్రతల కారణంతో అడ్డుచెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Germany Chancellor  Angela Merkel  Syrian Baby  

Other Articles