ఆ చిన్నారి కోరిక త్వరగా నెరవేరాలని కోరుకుందాం | Bana Alabed Syrian child need peace

Seven year old tweets about life in war torn aleppo

Bana Alabed, seven year old tweets, Bana Alabed twitter, Bana Alabed videos, Young girl Bana Alabed, JK Rowling Bana Alabed

Young girl Bana Alabed takes to Twitter to depict life in Aleppo.

ఆ చిన్నారికి ఏం కావాలో తెలుసా?

Posted: 11/25/2016 04:58 PM IST
Seven year old tweets about life in war torn aleppo

భూమ్మీద ప్రత్యక్ష నరకాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి ఉగ్ర రాక్షసుల బందీఖానాలో ఉన్న ప్రాంతాలే. ముఖ్యంగా ఫశ్చిమాసియా దేశాల్లోని కొన్ని దేశాలను తమ గుప్పిట్లోకి తీసుకుని, అక్కడి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసేస్తున్నారు. సిరియాకు రెండో రాజధానిగా పేరున్న అలెప్పో సిటీలో పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అక్కడ బాంబు మోతలు వినిపించని రోజూ లేదంటే అతిశయోక్తి కాదు.

ఏటునుంచి బాంబులు పడతాయో, తమ ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయోనన్న భయం, ప్రాణాల మీద ఆశ వదులుకుని మరి కొందరు ఇప్పుడు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి వారి పరిస్థితి గురించి ఓ ఏడేళ్ల పాప ఏమంటుందో చూడండి.

ఆ చిన్నారి పేరు బానా అలబెద్. తల్లి ఫతెమా సాయంతో ఓ ట్విట్టర్ అకౌంట్ ను మెయింటెన్ చేస్తోంది. ప్రతీ రోజూ అక్కడి పరిస్థితులను తన ఖాతాలో వివరిస్తోంది. అంతేకాదు ఈ మధ్య తన చిన్నారి నేస్తాన్ని బాంబు దాడిలో కోల్పోయానని బాధతో పేర్కొంది. హ్యారీ పోటర్ పుస్తకం కావాలని రచయిత్రి జెకె రౌలింగ్ కు విజ్నప్తి చేసింది. అంతే వెంటనే ఆమె పుస్తకం పంపించేసింది. సుమారు 90 వేల మంది పైగానే ఖాతాదారులు ఇప్పుడు ఆ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు. ఆ చిన్నారి ఉద్దేశం, కోరిక ఒక్కటే... శాంతి కావాలని....

ఒక్క రోజైనా బాంబులు పడని రాత్రి చూసి హాయిగా నిద్రపోవాలని ఉందంటూ, పైకి నవ్వుతున్నప్పటికీ లోపల ఎంత ఏడుస్తున్నానో తెలీదంటూ ఇలా ప్రతీరోజూ ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంది. దీనిపై చిన్నారి తల్లి ఫతేమా స్పందిస్తూ.. తన కూతురు రోజూ తనను అడిగే ఒకే ఒక్క ప్రశ్న.. అమ్మా! మనకు సాయం చేసే వారే లేరా? అని.

ఆ చిన్నారి తన ఇల్లు బాంబు దాడిలో నేలమట్టం అయిపోవటం చూసింది, కళ్ల ఎదుటే తన నేస్తం మట్టిలో కలిసిపోవటం చూసింది. చివరికి తాను నిత్యం చదివుతూ, ఆటలాడుకున్న పాఠశాల కూడా సర్వనాశనం అవ్వటం కూడా చూసింది. అదే కళ్లతో తన నేల మీద శాంతి విరజిల్లాలని కూడా చూస్తోంది. అదేం తప్పు కాదు కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles